Puja Khedkar: పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్ మోసం.!
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తన తల్లిదండ్రులు విడిపోయారని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె చెప్పింది. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అది నిజం కాదని తేల్చారు. పలు వివాదాల్లో చిక్కుకున్న ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి తెలియజేయాలని పూణే పోలీసులను కేంద్రం ఆదేశించింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తన తల్లిదండ్రులు విడిపోయారని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె చెప్పింది. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అది నిజం కాదని తేల్చారు. పలు వివాదాల్లో చిక్కుకున్న ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి తెలియజేయాలని పూణే పోలీసులను కేంద్రం ఆదేశించింది. యూపీఎస్‌సీ పరీక్షలో ఓబీసీ నాన్-క్రీమీ లేయర్‌ను పూజా వినియోగించుకుంది. ఇందుకోసం ఆమె తన తల్లిదండ్రులు విడిపోయారనే కారణాన్ని జత చేసింది. ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై కేంద్రం నివేదికను కోరింది.
పూణె పోలీసులు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పూజా తల్లిదండ్రులైన దిలీప్, మనోరమా ఖేడ్కర్‌లు చట్టబద్ధంగా విడిపోయారని, అయినప్పటికీ వారిద్దరూ కలిసే ఉంటున్నారని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తాను తండ్రికి దూరంగా తన తల్లితో ఉంటున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని ఆమె పేర్కొన్నారు. అయితే దిలీప్.. మనోరమ ఖేడ్కర్ 2009లో పూణేలోని ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2010, జూన్ 25న వారు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బన్నర్ ప్రాంతంలోని నివాసంలో కలిసే ఉంటున్నారు. కుటుంబ ఫంక్షన్‌లకు కలిసే హాజరవుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ సమర్పించిన అఫిడవిట్‌లో మనోరమను తన భార్యగా పేర్కొనడం కొసమెరుపు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

