Divorce: ఆమెకు ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు.. అన్నీ పెటాకులే! అసలు స్కెచ్‌ తెలిస్తే నోరెళ్లబెడతారు..

పెళ్లి పేరిట మోసగించి నగలు, డబ్బుతో ఉడాయించే నిత్య పెళ్లి కూతుళ్ల కథలు మీరిప్పటి వరకూ చాలానే విని ఉంటారు. ఇలాంటి కేసుల్లో నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకు పంపించారు కూడా. తరచూ ఈ విధమైన సంఘటనలు రాజస్థాన్, హర్యానాలలో జరుగుతుంటాయి. కానీ ఈ వీరనారీమణి కథ వింటే మీరు పక్కా పరేషాన్‌ అవుతారు. స్కెచ్‌ అలాంటిది మరీ. ఓ యువతి ఆరేళ్లలో ఏకంగా ఏడు..

Divorce: ఆమెకు ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు.. అన్నీ పెటాకులే! అసలు స్కెచ్‌ తెలిస్తే నోరెళ్లబెడతారు..
Woman’s Seventh Divorce Case
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 30, 2024 | 7:54 PM

బెంగళూరు, జులై 30: పెళ్లి పేరిట మోసగించి నగలు, డబ్బుతో ఉడాయించే నిత్య పెళ్లి కూతుళ్ల కథలు మీరిప్పటి వరకూ చాలానే విని ఉంటారు. ఇలాంటి కేసుల్లో నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకు పంపించారు కూడా. తరచూ ఈ విధమైన సంఘటనలు రాజస్థాన్, హర్యానాలలో జరుగుతుంటాయి. కానీ ఈ వీరనారీమణి కథ వింటే మీరు పక్కా పరేషాన్‌ అవుతారు. స్కెచ్‌ అలాంటిది మరీ. ఓ యువతి ఆరేళ్లలో ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకుని, ఏడుగురితో పెటాకులు కూడా చేసుకుంది. అయితే తనకు న్యాయం చేయాలంటూ ఏడుపులంకించుకుని కోర్టుకెక్కింది. అసలు సంగతి తెలుసుకున్న జడ్జిగారూ గుడ్లు తేలేశారు. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన ఓ మహిళ (32) చేసుకున్న దరఖాస్తును చూసి ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టు విచారణ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మహిళ ఏడవ విడాకుల గురించి న్యాయమూర్తి లాయర్‌తో మాట్లాడటం కనిపిస్తుంది. ఆమె ఏడవ భర్త నుంచి విడాకులు కోరుతుందని లాయర్‌ జడ్జికి చెబుతారు. అయితే గతంలో విడాకులు తీసుకున్న అందరిపై సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టారా అని జడ్జి ప్రశ్నిస్తారు. వివాహిత పట్ల కౄరంగా ప్రవర్తించినందుకు వారందరిపై సెక్షన్ 498A కింద కేసు పెట్టినట్లు లాయర్‌ తెలపడం వీడియోలో చూడొచ్చు. ప్రతి భర్తతో 6 నుంచి సంవత్సరం పాటు కాపురం చేసి, ఆనక విడాకులు కోసం దరఖాస్తు చేసుకునేదని, అందరి నుంచి సెటిల్‌మెంట్ డబ్బును కోరేదని లాయర్‌ తెలిపాడు. దీంతో సదరు మహిల చట్టాలను వాడుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు జడ్జి ఫైర్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

కేవలం డబ్బు కోసమే శ్రీమంతులను చూసి వివాహం చేసుకోవడం, అనంతరం ఏదో ఒక సాకు చెప్పి విడాకులు తీసుకోవడం చేస్తోందని సదరు మహిళ ఏడో భర్త కోర్టుకు తెలపడంతో ఆమె వంచన బయటపడింది. ఆరుగురు భర్తలు, అత్తింటి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ గృహహింస కింద కేసులు పెట్టి.. రాజీ పేరిట పెద్ద మొత్తంలో నగదు రాబడి చేసేది. ఇలాగే ఏడో భర్తపై కూడా మళ్లీ కేసు పెట్టడంతో.. ఆ మహిళ తీరును జడ్జి సోమవారం ఖండించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే.. అందులో మీ తప్పే కనిపిస్తోందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుపటి భర్తలతో తీసుకున్న మ్యారేజ్‌ సర్టిఫికెట్లతోపాటు, సదరు ఆరుగురు భర్తను కూడా తదుపరి విచారణకు హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. అనంతరం విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ కేసును న్యాయమూర్తి క్షుణ్ణంగా విచారించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. మరికొందరేమో అమ్మాయికి బదులుగా అబ్బాయి ఇలాంటి నేరం చేసి ఉంటే కోర్టు ఇలాగే ప్రవర్తించేదా? అరెస్ట్‌ చేసి, జైలుకు తరలించేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.