AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad Landslides: మహా విపత్తు.. నాలుగే.. నాలుగు గంటల్లో అంతా ఊడ్చేసింది.. హృదయవిదారక దృశ్యాలు

మహా విపత్తు.. నాలుగే.. నాలుగు గంటల్లో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.. ప్రకృతి విధ్వంసానికి ఎవరూ ఏం చేయలేకపోయారు.. కొండ చరియలు భారీగా విరిగిపడ్డాయి.. చూస్తుండగానే మూడు ప్రాంతాలు కనుమరుగైపోయాయి.. ఓ వైపు కొండ చరియలు విరిగిపడటం .. మరోవైపు వరద ప్రవాహం పోటెత్తడంతో వందలాది ఇళ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. వందలాది మంది ప్రజలు కూడా గల్లంతయ్యారు.

Wayanad Landslides: మహా విపత్తు.. నాలుగే.. నాలుగు గంటల్లో అంతా ఊడ్చేసింది.. హృదయవిదారక దృశ్యాలు
Wayanad Landslides
Shaik Madar Saheb
|

Updated on: Jul 30, 2024 | 10:03 PM

Share

మహా విపత్తు.. నాలుగే.. నాలుగు గంటల్లో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.. ప్రకృతి విధ్వంసానికి ఎవరూ ఏం చేయలేకపోయారు.. కొండ చరియలు భారీగా విరిగిపడ్డాయి.. చూస్తుండగానే మూడు ప్రాంతాలు కనుమరుగైపోయాయి.. ఓ వైపు కొండ చరియలు విరిగిపడటం .. మరోవైపు వరద ప్రవాహం పోటెత్తడంతో వందలాది ఇళ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. వందలాది మంది ప్రజలు కూడా గల్లంతయ్యారు. కేరళలోని వయనాడులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 125 కి చేరింది.. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు.. దీంతో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.. స్థానిక మసీదులో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంకాగాంధీ వయనాడు బయలుదేరారు. సహాయక చర్యలను రాహుల్‌ స్వయంగా పర్యవేక్షిస్తారు.

ఇప్పటిదాకా 250 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఈ పరిస్థితుల్లో కేరళకు రెండు ఆర్మీ కాలమ్స్‌ని కేంద్రం పంపించింది. అదేవిధంగా కేంద్రమంత్రి జార్జి కురియన్‌ని కేరళకు పంపించారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు మిగ్‌ 17, ధృవ్‌ హెలికాప్టర్లను ఎయిర్‌ఫోర్స్‌ రంగంలోకి దించింది. కేరళలో సహాయకచర్యల కోసం ఐదుకోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడం పెద్దసవాల్‌గా మారింది.

వయనాడుతో పాటు కేరళ లోని కోలికోడ్‌, త్రిసూర్‌, పాలక్కాడ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వంతెనలు కుప్పకూలాయి..ఇళ్లు ధ్వంసమయ్యాయి. చర్చిలతో పాటు ప్రార్థనా స్థలాల్లోకి కూడా వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.

వయనాడుకు టీవీ9 బృందం చేరుకుంది. ఆప్తుల జాడ తెలియక చాలామంది అల్లాడిపోతున్నారు. ముండకై గ్రామం లోనే వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వయనాడ్‌ జిల్లాలోని మెప్పడి దగ్గర్లోని గ్రామం వరద బీభత్సానికి కొట్టుకుపోయింది. గత రాత్రి మెప్పడి ప్రాంత వాసులకు కాళరాత్రి అయింది. ముండక్కాయ్‌, చూరామల, అట్టమల, నూల్‌పుళ వంటి అందమైన గ్రామాలు, ఇప్పుడు శవాలదిబ్బలుగా మారాయి.

ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యురాలు జెబీ హిషామ్‌ డిమాండ్ చేశారు. కుటుంబాలకు కుటుంబాలే కొట్టుకుపోయాయని ఆమె చెప్పారు. తక్షణ సాయంగా ఐదువేల కోట్ల రూపాయలను ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కేరళకు వెంటనే సాయం అందించాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ కోరారు. కొండచరియలు విరిగిపడి, వరదముప్పు ఉండే ప్రాంతాలను మ్యాపింగ్‌ చేయాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని కోరారు. అయితే కేరళను ఆదుకోవడానికి అన్నిచర్యలు చేపడుతున్నట్లు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్రమంత్రి జార్జి కురియన్‌ కేరళకు వెళ్లినట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..