AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs: డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎల్ఐసీలో ఉద్యోగాలు… ఎలా ఎంపిక చేస్తారంటే..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 200 జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆంధప్రదేశ్‌ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే కరస్పాండెన్స్‌/డిస్టెన్స్‌/పార్ట్‌మటైమ్‌ విధానంలో డిగ్రీ పూర్తి చేసిన వారు..

Jobs: డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎల్ఐసీలో ఉద్యోగాలు... ఎలా ఎంపిక చేస్తారంటే..
Lic Jobs
Narender Vaitla
|

Updated on: Jul 31, 2024 | 7:52 AM

Share

డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)లో ఉద్యోగం పొందే అవకాశం కల్పించింది. నోటిఫికేషన్‌లో భాగంగా హౌసింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందం..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 200 జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆంధప్రదేశ్‌ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే కరస్పాండెన్స్‌/డిస్టెన్స్‌/పార్ట్‌మటైమ్‌ విధానంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా నిర్ణయించారు. అయితే కచ్చితంగా కంప్యూటర్‌పైన పనిచేయడం తెలిసి ఉండాలి. స్కూలు లేదా కాలేజీ లేదా విద్యాసంస్థలో కంప్యూటర్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. లేదంటే.. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/ లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేయాలి.

కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారిని ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 01.07.2024 నాటికి 21 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థులు 02.07.1996 – 01.07.2003 మధ్య జన్మించినవారై ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.800గా నిర్ణయించారు.

ప్రశ్నపత్రం విషయానికొస్తే ప్రశ్నపత్రంలో ఐదు సెక్షన్లు ఉంటాయి మొత్తం 200 ప్రశ్నలకు పేపర్‌ ఉంటుంది. మొత్తం 4 సెక్షన్స్‌లో ప్రశ్నాపత్రం ఉటుంది. వీటిలో సెక్షన్‌-1లో ఇంగ్లిష్‌కు 40 ప్రశ్నలు, సెక్షన్‌-2లో లాజికల్‌ రీజనింగ్‌ 40 ప్రశ్నలు, సెక్షన్‌-3 జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు, సెక్షన్‌-4 న్యూమరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు, కంప్యూటర్‌ స్కిల్‌ 40 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ తప్పుడు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. అభ్యర్థులను రాత పరీక్షతో పాటు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us