AP Police Constable Jobs: ఏపీలో త్వరలో కానిస్టేబుల్‌ నియామకాలు.. ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్‌ ఖరారు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదలవగా.. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి. తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది..

AP Police Constable Jobs: ఏపీలో త్వరలో కానిస్టేబుల్‌ నియామకాలు.. ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్‌ ఖరారు!
AP Police Constable Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 31, 2024 | 2:31 PM

అమరావతి, జులై 31: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదలవగా.. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి. తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. వీరికి అదే ఏడాది 13 నుంచి 20వ తేదీ వరకూ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉండగా.. అనూహ్యంగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు.

ఆరంభంలోనే అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియను అప్పటి నుంచి పూర్తి చేసిన నాథుడు లేదు. ఏపీలో ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతలను చేపట్టింది. సాధ్యమైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి గతంలో దాఖలైన కొన్ని కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ పీహెచ్‌డీ రామకృష్ణ దీనిపై సమీక్షలు నిర్వహించారు. ఈ ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ ఎన్నికలైపోయిన తర్వాత ఈ నియామక ప్రక్రియ కొనసాగించకుండా నాటి సర్కార్‌ తాత్సారం చేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు ఊరట కలిగించేలా ఎన్డీయే ప్రభుత్వం కార్యచరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అంతకు ముందు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలైతే.. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం 3 నెలల వ్యవధిలో పూర్తి చేశారు. 2019 ఫిబ్రవరి నాటికి నియామక పత్రాలు కూడా జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?