Asha Worker Jobs in AP: పది పాసైన మహిళలు అర్హులు.. తూర్పు గోదావరి జిల్లాలో ఆశా వర్కర్ ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో.. 23 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో.. 23 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత/విడో/డివోర్స్/ఒంటరి మహిళై ఉండాలి. పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 15, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులను సమర్పించాలి. పదో తరగతిలో పొందిన మార్కులు, రిజర్వేషన్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. తుది మెరిట్ లిస్ట్ డిసెంబర్ 21న ప్రకటిస్తారు. నియామక ఉత్తర్వులు డిసెంబర్ 23న జారీ చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
DMHO, Kakinada, East Godavari, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.