CTET 2025 Exam Date: సీటెట్ డిసెంబర్ సెషన్ పరీక్ష తేదీ వచ్చేసింది.. పూర్తి షెడ్యూల్ ఇదే
CTET December 2025 exam schedule: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఈ ఏడాది డిసెంబర్ సెషన్‌కు సంబంధఙంచి 21వ ఎడిషన్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా పరీక్షా తేదీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారికంగా ప్రకటించింది. తాజా ప్రకటన మేరకు..

హైదరాబాద్, అక్టోబర్ 26: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఈ ఏడాది డిసెంబర్ సెషన్‌కు సంబంధఙంచి 21వ ఎడిషన్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా పరీక్షా తేదీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారికంగా ప్రకటించింది. తాజా ప్రకటన మేరకు దేశ వ్యాప్తంగా సీటెట్ 2026 పరీక్షను వచ్చ ఏడాది (2026) ఫిబ్రవరి 8వ తేదీ (ఆదివారం) పేపర్ 1, 2 పరీక్షలను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఒకటే రోజు రెండు సెషన్లలో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనుంది. మొత్తం 20 భాషలలో, 132 నగరాల్లో సీటెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది.
సీటెట్‌లో వచ్చిన ర్యాంకులకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ర్యాంకు ఆధారంగా KVS, NVS వంటి ఇతర అనుబంధ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులలో టీచర్లుగా పని చేయడానికి అవకాశం పొందొచ్చు. CTET డిసెంబర్ 2025 నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అర్హత కలిగిన అభ్యర్ధులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా CTET పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుంది. మొదటి సెషన్ జూలై, సెకండ్ సెషన్ డిసెంబర్‌లలో నిర్వహిస్తారు. పేపర్ 1,పేపర్ 2 రెండూ ఒకే రోజున జరుగుతాయి. వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో జారీ చేయబడుతుంది.
ఎస్‌ఎస్‌సీ 2025 దరఖాస్తు సవరణ తేదీలు మారాయ్.. కొత్త షెడ్యూల్ ఇదే
వివిధ కేంద్రప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ తేదీల్లో మార్పులు చేస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ఢిల్లీ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్-ఇన్స్పెక్టర్ల పరీక్షలు ఉన్నాయి. అప్లికేషన్ సవరన తేదీలను అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్‌సీ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) 2025 పరీక్షను కూడా తిరిగి షెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించిన స్లాట్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. సెల్ఫ్-స్లాట్ ఎంపిక సౌకర్యం ద్వారా అభ్యర్థులు ఇకపై పరీక్ష కోసం తమకు నచ్చిన నగరం, తేదీ, షిఫ్ట్ ను ఎంచుకునే సదుపాయం కల్పించింది. మరోవైపు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ పరీక్ష 2025కు ఆన్‌లైన్ దరఖాస్తు తేదీని అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు ఎస్‌ఎస్‌సీ తన ప్రకటనలో పేర్కొంది.
ఎస్ఎస్సీ-2025 ఆన్‌లైన్ దరఖాస్తు సవరణకు కొత్త తేదీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




