CBSE Girl Child Scholarship 2025: ఏకైక కూతురున్న తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేశారా?
CBSE Girl Child Scholarship 2025 Application last date: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) గుడ్‌న్యూస్ చెప్పింది. సీబీఎస్‌ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2025కు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆడపిల్ల తల్లిదండ్రులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) గుడ్‌న్యూస్ చెప్పింది. సీబీఎస్‌ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2025కు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తమ తల్లిదండ్రులకు జన్మించిన ఏకైక అమ్మాయిలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. గత విద్యాసంవత్సరంలో పదో తరగతి పాసై 2025-26 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ స్కాలర్‌షిప్‌కు నవంబర్ 20, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సీబీఎస్‌ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2025కు దరఖాస్తు చేసుకునే బాలికలు పదో తరగతి పరీక్షలో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకుండా ఉండాలి. అలాగే గతేడాది ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత 12వ తరగతికి సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో రెన్యువల్ చేసుకోవల్సి ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవాలంటే, విద్యార్థిని కనీసం 70శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. సీబీఎస్‌ఈ బోర్డులో విద్యనభ్యసిస్తున్న ఎన్నారై విద్యార్థినులు కూడా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6 వేలకు మించకూడదు. అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబనఖ 20, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ. వెయ్యి చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




