CBSE CTET 2021: CTET పరీక్ష తేదీలు విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం..

CBSE CTET 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పరీక్ష తేదీలను విడుదల చేసింది.

CBSE CTET 2021: CTET పరీక్ష తేదీలు విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం..
Ctet
Follow us
uppula Raju

|

Updated on: Sep 18, 2021 | 2:42 PM

CBSE CTET 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌ మోడ్‌లో ఉంటుంది. 16 డిసెంబర్ 2021 నుంచి13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష, సిలబస్, అర్హత ప్రమాణాలు, పరీక్ష రుసుము, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి సమాచార బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేసేముందు ఒక్కసారి జాగ్రత్తగా చదవాలని CBSE సూచించింది.

అభ్యర్థులు CTET వెబ్‌సైట్ ctet.nic.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2021 సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ19 అక్టోబర్ 2021. ఫీజు 2021 అక్టోబర్ 30 మధ్యాహ్నం 3:30 వరకు చెల్లించవచ్చు. ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్/OBC అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. రెండు పేపర్‌లకు అయితే రూ.1200 చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్‌కు రూ.500 రెండు పేపర్‌లకు రూ.600 ఉంటుంది.

CTET 2021 పరీక్ష కోసం ఎలా నమోదు చేసుకోవాలి

1. నమోదు చేయడానికి మొదట CTET, ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 2. వెబ్‌సైట్‌లో నమోదు కోసం లింక్‌పై క్లిక్ చేయాలి. 3. ఇప్పుడు పేరు, ఈ మెయిల్, మొబైల్ నంబర్, అభ్యర్థించిన ఇతర సమాచారాన్ని సమర్పిచాలి. 4. తర్వాత లాగిన్ అవ్వాలి. 5. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని తప్పులు లేకుండా నింపాలి. 6. ఫోటోను అప్‌లోడ్ చేసి సంతకం చేయాలి. 7. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 8. అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత చివరకు ప్రింట్ అవుట్ తీసుకోండి.

Kiss in Bus: ‘గీతాగోవిందం’ సినిమా చూసి రెచ్చిపోయిన యువకుడు.. బస్సులో పక్క సీట్లో కూర్చున్న అమ్మాయిని..

Maestro Movie: తమన్నా బ్రెయిన్‌ను మార్చేశారు, ఎందుకలా చంపుతుందంటూ ఏడ్చేసిన దర్శకుడి కూతురు.. ఎందుకో తెలుసా?

Minister KTR: విశ్వరూపం చూపించిన మంత్రి కేటీఆర్.. డ్రగ్స్, పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్..