Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maestro Movie: తమన్నా బ్రెయిన్‌ను మార్చేశారు, ఎందుకలా చంపుతుందంటూ ఏడ్చేసిన దర్శకుడి కూతురు.. ఎందుకో తెలుసా?

Maestro Movie: నితిన్‌ హీరోగా నభానటేశ్‌, తమన్నా హీరోయిన్‌లుగా తెరకెక్కిన చిత్రం 'మాస్ట్రో'. నిజానికి సినిమా థియేటర్‌లలో విడుదలకావాల్సి ఉండగా కరోనా కారణంగా ఓటీటీ వేదికగా..

Maestro Movie: తమన్నా బ్రెయిన్‌ను మార్చేశారు, ఎందుకలా చంపుతుందంటూ ఏడ్చేసిన దర్శకుడి కూతురు.. ఎందుకో తెలుసా?
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 18, 2021 | 2:38 PM

Maestro Movie: నితిన్‌ హీరోగా నభానటేశ్‌, తమన్నా హీరోయిన్‌లుగా తెరకెక్కిన చిత్రం ‘మాస్ట్రో’. నిజానికి సినిమా థియేటర్‌లలో విడుదలకావాల్సి ఉండగా కరోనా కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైంది. డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడదులైన ఈ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యిందని చెప్పాలి. ముఖ్యంగా తమన్నా యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు బబ్లీ గర్ల్‌గా నటించిన తమన్నా తొలిసారి నెగిటివ్‌ రోల్‌లో కనిపించడం విశేషం. దీంతో తమన్నా పాత్రను కొందరు ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిలో ముందు వరుసలో ఉంటారు దర్శకుడు మేర్లపాక గాంధీ చిన్న కూతురు లిపి.

ఇంతకీ విషయమేమింటే తాజాగా దర్శకుడు కూతురు కుటుంబసభ్యులతో కలిసి మ్యాస్ట్రో సినిమాను వీక్షించింది. ఈ సందర్భంగా తమన్నా క్యారెక్టర్‌ను చూసి తీసుకోలేకపోయిన ఆ చిన్నారి.. ఏడుపు మొదలుపెట్టేసింది. దీంతో పక్కన ఉన్న వారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా.. ‘గాంధీ తమన్నా బ్రెయిన్‌ మార్చేశాడు. ఎందుకు తమన్నా అందరినీ చంపుతుందీ’ అంటూ ఏడుస్తూ మాట్లాడింది.

దీంతో దీనిని వీడియో తీసిన కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గామారింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన హీరో నితిన్‌.. ‘ఏంటి ఇది తమన్నా.. నీ ఫ్యాన్‌ను ఏడిపించావు. ఈ రోజు నేను చూసిన క్యూట్‌ వీడియో ఇది. దర్శకుడు గాంధీ చిన్నకూతురు లిపి.. నీకు పెద్ద ఫ్యాన్‌’ అంటూ తమన్నాను ట్యాగ్‌ చేశాడు. ఇది చూసిన తమన్నా ‘తప్పకుండా ఆ చిన్నారికి హగ్‌ ఇవ్వాల్సిందే’ అని కామెంట్‌ చేసింది.

Also Read: Rakhi Sawanth: మరోసారి నువ్వు గెలవకుండా చూస్తా.. ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేకి రాఖీ సావంత్ భర్త హెచ్చరిక

Nivetha Pethuraj: బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్ననేచురల్ బ్యూటీ… నివేత పేతురాజ్ గ్రామరస్ ఫొటోస్..

Maa Elections 2021: మంచు విష్ణు ప్యానల్‏లో జనరల్ సెక్రెటరీగా ఆ నటుడు.. షాక్‏లో ప్రకాష్ రాజ్ టీం..