Maa Elections 2021: మంచు విష్ణు ప్యానల్‏లో జనరల్ సెక్రెటరీగా ఆ నటుడు.. షాక్‏లో ప్రకాష్ రాజ్ టీం..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. సాధారణ రాజకీయ పరిస్థితులను తలపిస్తున్న సంగతి తెలిసిందే. బరిలో ఉన్న అభ్యర్థులు నువ్వా ? నేనా ? అన్నట్లుగా పోటీ పడుతున్నారు.

Maa Elections 2021: మంచు విష్ణు ప్యానల్‏లో జనరల్ సెక్రెటరీగా ఆ నటుడు.. షాక్‏లో ప్రకాష్ రాజ్ టీం..
Manchu Vishnu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 18, 2021 | 1:04 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. సాధారణ రాజకీయ పరిస్థితులను తలపిస్తున్న సంగతి తెలిసిందే. బరిలో ఉన్న అభ్యర్థులు నువ్వా ? నేనా ? అన్నట్లుగా పోటీ పడుతున్నారు. మీడియా సమావేశాలలో ఒకరిపై ఒకరు బహిరంగా విమర్శలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. మా ఎన్నికలలో రోజు రోజుకీ ట్విస్ట్ చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా.. ఈసారి అధ్యక్ష పదవికి పోటి చేస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య అసలైన పోటీ జరుగుతుండగా.. అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుని బరిలోకి బండ్ల గణేష్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో… బరిలో ఉన్న అభ్యర్థులు పలువురు నటులతో మంతనాలు జరుపుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు.. తమ ప్యానల్ సభ్యులతో లంచ్ మీట్స్, డిన్నర్ మీట్స్ అంటూ ఓట్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అందులో అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీంగ్ నిర్వహించనున్నట్లుగా ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ వెల్లడించారు. అలాగే.. అదే రోజు ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మా ఎన్నికలను జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‏లో నిర్వహించనున్నారు. ఇక ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మా ఎన్నికలలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంచు విష్ణు ప్యానల్‏లో సీనియర్ నటుడు రఘుబాబు జాయిన్ అయ్యారు. ఆయనను జనరల్ సెక్రటరీగా ఎంపిక చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‏గా బాబు మోహన్ పోటీలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే తమ ప్యానల్‍కు సంబంధించిన సభ్యుల గురించి అధికారికంగా ప్రకటించనున్నారు మంచు విష్ణు.

ఇక తాజాగా విడుదలైన మా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. ఒక అభ్యర్ధి ఒక పోస్టుకే పోటీ చేయాల్సి ఉంటుంది. అలాగే గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్ లకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది. ఇక 24 క్రాప్ట్స్ లో ఆఫీస్ బేరర్‏గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.

Also Read: Love Story: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురానున్న లవ్ స్టోరీ..

Maa Elections 2021: మా ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల.. కండీషన్స్ అప్లై..

Samantha : లేడీ ఓరియెంటెడ్ కథల వైపే అక్కినేని కోడలు ఆసక్తి.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్..