Rakhi Sawanth: మరోసారి నువ్వు గెలవకుండా చూస్తా.. ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేకి రాఖీ సావంత్ భర్త హెచ్చరిక

Janardhan Veluru

Updated on: Sep 18, 2021 | 1:43 PM

రాఖీ సావంత్.. బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా అందరికీ తెలిసిన పేరు. అయితే ఇప్పుడామె పేరు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటంటే..?

Rakhi Sawanth: మరోసారి నువ్వు గెలవకుండా చూస్తా.. ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేకి రాఖీ సావంత్ భర్త హెచ్చరిక
Rakhi Sawanth

Follow us on

Rakhi Sawanth:  రాజకీయ ప్రయోజనాల కోసం రాఖీ సావంత్ పేరును వాడుకోవడం సరికాదంటూ ఆమె భర్త రితేష్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే‌పై మండిపడ్డారు. ఆ మేరకు ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, పంజాబ్ ఆప్ వ్యవహారాల్ కో-ఇంఛార్జి రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలకు రాఖీ సావంత్ భర్త గట్టి కౌంటర్ ఇచ్చారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ‌.. పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అంటూ రాఘవ్ చద్దా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పరోక్షంగా పంజాబ్ రాజకీయాల్లో సిద్ధూ ఐటమ్ గర్ల్ అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిద్ధూను రాఖీ సావంత్‌తో పోల్చుతూ ఆప్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వివాదం రాజుకుంది. ఆప్ నేత వ్యాఖ్యలపై రాఖీ సావంత్ భర్త రితేష్ అభ్యంతరం వ్యక్తంచేశారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాలను పాడుచేయొద్దన్నారు. ఈ విషయంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జోక్యం చేసుకుని.. తమ పార్టీ ఎమ్మెల్యేని గాడిలో పెడితే మంచిదన్నారు.

దీన్ని వార్నింగ్‌గా పరిగణించాలని మరోసారి తన భార్య పేరును మీ రాజకీయ వివాదంలోకి తీసుకొస్తే.. చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మరో ట్వీట్‌లో రాఖీ సావంత్ భర్త హెచ్చరించారు. ఇంకోసారి మీరు ఎన్నికల్లో విజయం సాధించకుండా చూస్తానంటూ ఆప్ ఎమ్మెల్యేని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత మీకు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతరుల పేర్లకు భంగం కలిగించే ఆ అధికారం మీకు ఎక్కడిదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

అటు తన భర్త చేసిన ట్వీట్‌ స్ర్కీన్ షాట్‌ను రాఖీ సావంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తననుద్దేశించి ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఆమె.. తనకు అండగా నిలిచిన భర్త రితేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సిద్ధూ.. పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అంటూ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా చేసిన ట్వీట్..

Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్.. పన్ను ఎగవేతపై ఐటీ శాఖ కీలక ప్రకటన.. షాక్‌లో అభిమానులు

Hyderabad: పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో వధువు జంప్.. ట్విస్ట్ ఏంటంటే

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu