Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIT Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఎన్ఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..!

National Institute of Technology: కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు..

NIT Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఎన్ఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2021 | 1:50 PM

National Institute of Technology: కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి సంస్థలు. ఇక తాజాగా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ( National Institute of Technology) అగర్తలాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా గ్రూప్‌-ఏ విభాగంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబ‌ర్ 30, 2021. డిప్యూటీ రిజిస్ట్రార్‌, డిప్యూటీ లైబ్రేరియ‌న్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌, ఎగ్జిక్యూటీవ్ ఇంజ‌నీర్‌, సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌ర పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకోనే అభ్యర్థులు అధికారికి నోటిఫికేష‌న్‌ను చూసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ప‌రీక్ష ఫీజు రూ.1000 ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లిస్తే స‌రిపోతుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

డిప్యూటీ రిజిస్టార్‌ పోస్టుకు.. 55శాతం మార్కులతో ఏదైనా విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. విద్యారంగం అడ్మినిస్ట్రేషన్‌లో మూడు సంవత్సరాలు, బోధనా రంగంలో తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా ఐదు సంవత్సరాలు విద్యారంగం అడ్మినిస్ట్రేషన్లో పని చేసిన అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించి ఉండకూడదు.

డిప్యూటీ లైబ్రేరియన్‌ పోస్టుకు.. 6.5 జీపీఏ లేదా 60 శాతం మార్కులతో లైబ్రేరియన్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. నెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించి ఉండకూడదు

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టుకు.. 55 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా ప్రైవేటు రంగంలో సూపరింటెండెంట్ గా పని చేసి అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లకు మించి ఉండకూడదు.

అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టుకు.. 6.5జీపీఏ లేదా 60 శాతం మార్కులతో లైబ్రేరియన్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు.

ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టుకు.. సివల్, ఎలక్ట్రికల్ విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. మెరుగైన అకాడమిక్ రికార్డు ఉండాలి. వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు.

సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు.. ఎంబీబీఎస్ చదివి పది సంవత్సరాల పని అనుభవం ఉండాలి. లేదా పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్‌లో ఎండీ చేసి ఐదు సంవత్సాల పని అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించి ఉండకూడదు.

మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు.. ఎంబీబీఎస్ లేదా పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ లో ఎండీ చేసి ఉండాలి వయసు 35 సంవత్సరాలు మించి ఉండకూడదు.

సైన్టిఫిక్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు.. ఫస్ట్ క్లాస్ మార్కులతో బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ పాసై ఉండాలి.

ఎస్‌ఏఎస్‌ ఆఫీసర్‌ పోస్టుకు.. 60శాతం మార్కులతో ఫిజికల్ విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు.

దరఖాస్తు చేసుకోండిలా..

– ముందుగా అభ్యర్థులు అధికారిక నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి అనంత‌రం ద‌ర‌ఖాస్తు కోసం. https://mis.nita.ac.in/recruitment/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మీ మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అనంత‌రం మీరు ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొంటున్నారో ఆ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు అనంత‌రం ఓ అప్లికేష‌న్ కాపీని మీ వ‌ద్ద భద్రపర్చుకోవాలి. ద‌ర‌ఖాస్తు రుసం రూ.1000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ సెప్టెంబ‌ర్ 30, 2021.

ఇవీ కూడా చదవండి: Junior Panchayat Secretary: జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాష్ట్ర వ్యాప్తంగా 172 పోస్టులు..

Model Schools: విద్యార్థులకు అలెర్ట్.. మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 30 చివరి తేదీ.. వివరాలివే..