Model Schools: విద్యార్థులకు అలెర్ట్.. మోడల్ స్కూళ్లల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 30 చివరి తేదీ.. వివరాలివే..
Telangana Model Schools Admissions -2021: తెలంగాణలోని మోడల్ స్కూళ్లల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7 తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల
Telangana Model Schools Admissions -2021: తెలంగాణలోని మోడల్ స్కూళ్లల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7 తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 21న రెండు సెషన్లల్లో నిర్వహించారు. అనంతరం ప్రవేశ పరీక్షకు సంబంధించిన మెరిట్ కమ్ ర్యాంకు కార్డులను రాష్ట్ర విద్యాశాఖ సెప్టెంబర్ 15న విడుదల చేసింది. అయితే.. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ప్రవేశాల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుండగా.. దీని చివరి తేదీ ఈనెల 20తో ముగుస్తుందని మోడల్ స్కూళ్ల సంచాలకులు వెల్లడించారు. ఈ మేరకు ఆయా మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్‌కు విద్యార్థుల సమాచారాన్ని కూడా పంపించినట్లు తెలిపారు.
అయితే.. ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం మిగిలిన సీట్ల భర్తీను ఆయా స్కూళ్ల ప్రిన్సిపాల్స్.. ఆఫ్‌లైన్ పద్దతిలో చేపట్టవచ్చని పేర్కొన్నారు. కాగా.. ఈ ప్రవేశాల ప్రక్రియను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ల సంప్రదింపులతో సెప్టెంబర్ 30వ తేదీ కల్లా పూర్తిచేయాలని మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Also Read: