AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IGNOU: MBA కోర్సును ప్రారంభించిన IGNOU.. ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకోండి..

IGNOU: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)

IGNOU: MBA కోర్సును ప్రారంభించిన IGNOU.. ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకోండి..
Ignou
uppula Raju
|

Updated on: Sep 17, 2021 | 9:46 PM

Share

IGNOU: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సును AICTE ఆమోదించింది. అర్హులైన అభ్యర్థులు జూలై సెషన్ కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in లో సందర్శించి అడ్మిషన్‌ తీసుకోవచ్చు. విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా MBA కోర్సును ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిశ్రమ-విద్యా అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సును రూపొందించారు. 50 శాతం మార్కులు ఉన్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు, 45 శాతం మార్కులు ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా నుంచే కాకుండా ఎంపిక చేసిన విదేశాల నుంచి కూడా అభ్యర్థులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులో ప్రవేశం కోసం యూనివర్సిటీ ద్వారా ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు. MBA కోర్సు ఐదు విభిన్న స్పెషలైజేషన్‌లను అందిస్తుంది. మానవ వనరుల నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ నిర్వహణ, సేవా నిర్వహణ, ఫైనాన్స్‌ నిర్వహణ ఉన్నాయి. ప్రోగ్రామ్ కనీస వ్యవధి 2 సంవత్సరాలు గరిష్టంగా 4 సంవత్సరాలు ఉంటుంది. కోర్సు కోసం దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. లింక్ ఇగ్నో అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఎలా నమోదు చేయాలి 1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ ignouadmission.samarth.edu.in కి వెళ్లండి. 2. వెబ్‌సైట్‌లో కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అనే లింక్‌పై క్లిక్ చేయండి. 3. ఆ తర్వాత మీ పేరు, తండ్రి పేరు, మొబైల్, ఇమెయిల్ ఇతర సమాచారాన్ని నింపండి. 4. ఇప్పుడు లాగిన్ చేసి మీ దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. 5. ఫోటోను అప్‌లోడ్ చేసి సంతకం చేయండి. 6. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 7. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.

Fast Charging: ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు చెబుతున్న ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా అవుతుందో తెలుసా?

GST Council: జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు.. ప్రస్తుతం సరియైన సమయం కాదుః ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

CM Jagan: ఇంతకుముందెన్నడూ లేని విధంగా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్‌