AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fast Charging: ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు చెబుతున్న ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా అవుతుందో తెలుసా?

చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి తన 11 టి సిరీస్ లో భాగంగా.. 11 టి, 11 టి ప్రో  పేరుతో  2 స్మార్ట్‌ఫోన్‌లను  మొన్న  విడుదల చేసింది. మొదటిసారిగా, కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో 120W హైపర్ ఛార్జర్‌ను తీసుకువచ్చింది.

Fast Charging: ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు చెబుతున్న ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా అవుతుందో తెలుసా?
Fast Charging
KVD Varma
|

Updated on: Sep 17, 2021 | 9:41 PM

Share

Fast Charging:  చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి తన 11 టి సిరీస్ లో భాగంగా.. 11 టి, 11 టి ప్రో  పేరుతో  2 స్మార్ట్‌ఫోన్‌లను  మొన్న  విడుదల చేసింది. మొదటిసారిగా, కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో 120W హైపర్ ఛార్జర్‌ను తీసుకువచ్చింది. Xiaomi 11T Pro లో 5000mAh బలమైన బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ 120W Xiaomi హైపర్ ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది. Xiaomi 11T Pro కేవలం 17 నిమిషాల్లో 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఛార్జర్ భద్రత కోసం TUV సేఫ్ ఛార్జ్ సిస్టమ్ సర్టిఫికెట్‌ను కూడా పొందింది.

ఈ నేపధ్యంలో  స్మార్ట్ ఫోన్ చార్జింగ్ వేగంగా ఎలా వుతుంది అనేది తెలుసుకుందాం.  1983 లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మొట్టమొదటి పోర్టబుల్ ఫోన్ మోటరోలా డైనా TAC 8000X, 1 గంట టాక్ టైమ్ కలిగి ఉండగా, ఛార్జ్ చేయడానికి సుమారు 8 గంటలు పట్టింది. తరువాత అది క్రమేపీ మారుతూ వచ్చింది. కానీ, ఇప్పటికీ మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం ఎక్కువ టైమే పడుతుంది. అయితే, ఇప్పుడిప్పుడే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. దీంతో వేగంగా ఫోన్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి వీలవుతోంది. అసలు ఇప్పుడు వస్తున్న ఈ  ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో  ఇప్పుడు తెలుసుకుందాం.

ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా పని చేస్తుంది?

  • మీ ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు, దానిలో పవర్ ఉత్పత్తి అవుతుంది. అనగా పవర్ అంటే ఆంపియర్‌లు..వోల్ట్‌ల తో లెక్కవేస్తారు.  మీరు పైపు ద్వారా నీటిని పోస్తున్నట్లయితే, పైప్‌లోని శక్తి మొత్తం వోల్టేజ్‌గా ఉంటుంది. ప్రవాహం రేటు వోల్ట్ గా ఉంటుంది. అంటే ఆంపియర్ ఉండే విధంగా శక్తి గురించి ఆలోచించండి. ఆంపియర్, వోల్టేజ్ కలిపితే, అప్పుడు పవర్ ఏర్పడుతుంది. ఈ విధంగా, ఆంపియర్, వోల్టేజ్ కలిపి ఒక వాట్ ఏర్పడుతుంది. మొబైల్ ఛార్జర్‌లో అదే వాట్ గా చొప్పించడం జరుగుతుంది.
  • ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ పూర్తిగా వోల్ట్‌లపై ఆధారపడి ఉంటుంది. మనం సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడితే, స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌లో 5 వోల్ట్‌లతో ఛార్జ్ చేయబడుతుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో, 5 వోల్ట్‌లకు బదులుగా, ఫోన్ ఎక్కువ వోల్ట్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా ఛార్జ్ చేయడం జరుగుతుంది.
  • స్మార్ట్ ఫోన్‌కు VoLTE ని పంపేది అడాప్టర్. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం అడాప్టర్ 5 వోల్ట్‌లకు బదులుగా స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ వోల్టేజ్‌ను పంపే విధంగా తయారు చేస్తారు. దీనితో పాటు, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. తద్వారా ఇది బ్యాటరీని 33 లేదా అంతకంటే ఎక్కువ వాట్ల వేగంతో ఛార్జ్ చేయగలదు. వేగవంతమైన ఛార్జింగ్‌లో, వోల్టేజ్ పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని అధిక వోల్టేజ్‌తో ఛార్జ్ చేసే విధంగా తయారు చేయడం జరుగుతుంది. తద్వారా బ్యాటరీ వేగంగా ఛార్జ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

Vaccine Fake Certificate: టెలిగ్రాం వేదికగా నకిలీ కరోనా టీకా సర్టిఫికెట్ల జోరు.. చెక్ పాయింట్ నివేదికలో వెల్లడి!

Elon Musk Space X: మరోచరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్..అంతరిక్షంలోకి సామాన్యులను చేర్చిన స్పేస్ ఎక్స్