AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior Panchayat Secretary: జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాష్ట్ర వ్యాప్తంగా 172 పోస్టులు..

TS Junior Panchayat Secretaries Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం.. శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ శాఖలో పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల

Junior Panchayat Secretary: జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాష్ట్ర వ్యాప్తంగా 172 పోస్టులు..
Telangana Government
Shaik Madar Saheb
| Edited By: Subhash Goud|

Updated on: Sep 18, 2021 | 6:07 AM

Share

TS Junior Panchayat Secretaries Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం.. శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ శాఖలో పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 172 ఖాళీలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు 2021 సెప్టెంబర్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 10 చివరి తేదీగా నిర్ణయించింది. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కావున.. విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించి ఉండాలని అధికారులు వెల్లడించారు.

జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టులు.. అర్హతలు: డిగ్రీ పాసై ఉండాలి, స్పోర్ట్స్ కోటా గైడ్‌లైన్స్ పూర్తి చేయాలి. వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు- జనరల్, బీసీ క్రీమీలేయర్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు రూ.400. ఎంపిక విధానం- రాతపరీక్ష. (100 మార్కులకు ఒకటి చొప్పున 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్లో 35 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2021 సెప్టెంబర్ 18 దరఖాస్తుకు చివరి తేదీ: 2021 అక్టోబర్ 10 పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.. ఆదిలాబాద్-6, భద్రాద్రి కొత్తగూడెం-7, జగిత్యాల-5, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 3, కామారెడ్డి 8, కరీంనగర్ 4, ఖమ్మం 9, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 7, మహబూబ్ నగర్, నారాయణపేట 10, మంచిర్యాల 4, మెదక్ 6, నాగర్‌కర్నూలు 6, నల్గొండ 13, నిర్మల్ 6, నిజామాబాద్ 8, పెద్దపల్లి 3, సిరిసిల్ల 3, రంగారెడ్డి 7, సంగారెడ్డి 8, సిద్దిపేట 6, సూర్యాపేట 6, వికారాబాద్ 8, వనపర్తి 3, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 1, యాదాద్రి భువనగిరి 6.

Also Read:

DGP Mahender Reddy: అసలు ఆ అనుమానాలే అక్కర్లేదు.. రేపిస్ట్ రాజు మృతిపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం.. 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇంటర్మీడియట్ స్థాయికి పెంపు