Minister KTR: విశ్వరూపం చూపించిన మంత్రి కేటీఆర్.. డ్రగ్స్, పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్..

Minister KTR: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన..

Minister KTR: విశ్వరూపం చూపించిన మంత్రి కేటీఆర్.. డ్రగ్స్, పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్..
Ktr

Minister KTR: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సహా కాంగ్రెస్, బీజేపీల బహిరంగ సభలపై సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిని తిడితే బట్టలూడదీసి కొడతామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. అంతేకాదు.. రాష్ట్రాన్ని పొగిడితే జాతీయ నాయకున్ని గాడిద అన్న రేవంత్ రెడ్డి.. అడ్డ గాడిదనా.. నిలువు గాడిదనా అంటూ ఘాటైన వ్యాఖ్యలతో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నిర్మల్ వేదికగా బీజేపీ, గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీలు శుక్రవారం నాడు బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సభలలో ఆయా పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీల నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసుకుంటూ, గ్రామాలు తిరుగుతూ ఒకాయన పాదయాత్ర చేస్తుంటే.. ఇంకొకాయన మార్కెట్‌లోకి కొత్తగా వచ్చి హడావుడి చేస్తున్నాడని, మార్కెటింగ్ చేసుకుంటున్నాడని బండి సంజయ్, రేవంత్ రెడ్డిపై సెటైర్లు పేల్చారు.

రేవంత్‌పై సంచలన కామెంట్స్..
సీఎం ఇలాకా గజ్వేల్‌లో సభ పెట్టామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని ఎద్దేవా చేశారు. మాణిక్కం ఠాకూర్ రూ. 50 కోట్లకు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలా పీసీసీని కొనుగోలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకునే ప్రయత్నం మొదలు పెట్టారని విమర్శించారు. ఇప్పటి నుంచే పార్టీకి మార్కెటింగ్ చేసుకొని ఎన్నికలప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటారని ఆరోపించారు. ఇక ఎవరు ఎక్కువగా తిడితే వారికే యూట్యూబ్‌లో వ్యూస్ వస్తున్నాయని, నెగటీవ్ వార్తలకు ఎక్కువగా పబ్లిసిటీ వస్తోందని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో కొందరు నేతలు ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా తిడుతున్నారని, నోరు ఉందికదా అని తిడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కువ మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఎవరెవరి అక్రమ సంపాదన ఏంటో తమకు అన్నీ తెలుసునన్న కేటీఆర్.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు. రాజకీయాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతల తీరును తూర్పారబట్టారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని పొగిడిన జాతీయ నాయకత్వాన్ని గాడిద అంటావు.. మరి నువ్వు అడ్డ గాడిదవా? నిలువు గాడిదవా?’’ అంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్.

ఏం చేశారో చెప్పకుండా మతం ముసుగేంటి..?
తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పులుముతోందని ఆ పార్టీ తీరును తూర్పారబట్టారు మంత్రి కేటీఆర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నిర్మల్ పర్యటనలో మతం రంగుతో మాట్లాడారని విమర్శించారు. 7 ఏళ్ళల్లో బీజేపీ ఏం చేసిందో చెప్పాలి గానీ.. ఎంఐఎంకు తాము భయపడుతున్నామంటూ సొల్లు కబర్లు చెప్పడం ఏంటని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎన్నో హామీలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. శుక్రవారం నాడు నిర్మల్ వెళ్లిన అమిత్ షా.. ఆ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పలేదెందుకు? అని ప్రశ్నించారు. అప్పటి పోరాట యోధులకు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పలేదెందుకు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ పార్టీలకు సిల్లీ పాలిటిక్స్ మాత్రమే తెలుసంటూ కాంగ్రెస్, బీజేపీలను ఏకి పారేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అవసరాలు జాతీయ పార్టీలకు అర్థంకావని అన్నారు.

హుజూరాబాద్ అంత పెద్ద విషయం కాదు..
తెలంగాణ చరిత్రలో మొదటిసారి 3 జూట్ మిల్లులు వచ్చాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాము ప్రభుత్వంలో ఉండి బిజీగా ఉన్నామని, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అంత పెద్ద విషయమే కాదని అన్నారు. అక్కడ వందశాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, అందులో అనుమానమే లేదని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యత అవసరం లేదన్న మంత్రి కేటీఆర్.. అక్కడ తాము గెలిచినంత మాత్రాన కేంద్రంలో బీజేపీ దిగిపోదన్నారు.

కొత్త పార్టీలు ఎందుకొచ్చాయో అందరికీ తెలుసు..
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పార్టీలు ఎందుకు పుట్టుకొచ్చాయో ప్రజలకు బాగా తెలుసునని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఒక్క కేసీఆర్‌ను మాత్రమే ఎందుకు తిడుతున్నారు అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌ను పొగిడింది ఆయనే కదా? అని అన్నారు. బీజేపీ విషయంలో ఆయన నోరు ఎందుకు పెకలడం లేదని నిలదీశారు. కాంగ్రెస్‌పై ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నవోదయ స్కూల్స్ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఒక వైఎస్ షర్మిల కూడా అదే పంథాలో నడుస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

నేను రెడీ.. దమ్ముంటే రాహుల్ గాంధీ వస్తాడా?..
ఇదే సమయంలో డ్రగ్స్ అంశంపై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తనను డ్రగ్స్‌కు అంబాసిడర్ అని కొందరు అంటున్నారని, వాళ్లు అసలు మనిషేనా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నా రక్త నమూనాలు, లివర్ టెస్ట్ ఇస్తా.. దమ్ముంటే మీ రాహుల్ గాంధీ కూడా వస్తాడా?’’ అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరాడు. ఇదే సమయంలో తనకు వ్యతిరేకంగా ఈడీకి లేఖ రాసిన ప్రతిపక్ష నాయకుడిపైనా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదేం చిల్లర రాజకీయం అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణపై, తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే రాజద్రోహం కేసులు కూడా పెడతామన్నారు.

Also read:

Viral Video: ఒక్క బైక్‌పై 13 మంది చిన్నారుల ప్రయాణం.. ఓరయ్యా ఏం చేద్దామనుకుంటున్నావ్ వారిని..!

Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు మీకోసం..

Click on your DTH Provider to Add TV9 Telugu