Kitex in Telangana: తెలంగాణాలో మరో కంపెనీ భారీ పెట్టుబడి.. 22వేల ఉద్యోగాలు, 3లక్షల ఎకరాల్లో పత్తి కొనుగోలు చేసే అవకాశం..
Kitex in Telangana : తెలంగాణకు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడుల వెల్లువ ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలు, సంస్థలు స్థాపించేందుకు ప్రముఖ కంపెనీలు..
Kitex in Telangana: తెలంగాణకు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడుల వెల్లువ ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలు, సంస్థలు స్థాపించేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా మరో పరిశ్రమన తెలంగాణాలో భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు ఈ రోజు సదరు కంపెనీ.. తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. కేరళకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ వరంగల్‌లోని కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి సీతారామ్‌పూర్‌లో ప్లాంటు ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు జరిగిన అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్‌తో పాటు కంపనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కైటెక్స్ గ్రూప్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేరళ నుంచి పెట్టుబడులు సంపాదించుకున్న కైటెక్స్ ఎండీ జాకబ్ తో నేరుగా మాట్లాడినట్లు చెప్పారు. రూ. 2,400 కోట్ల పెట్టుబడి పెట్టాలని కైటెక్స్ గ్రూప్ నిర్ణయించిందన్నారు. దీంతో 22000 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన, మరో 20,000 పైగా పరోక్ష ఉపాధి లభించనున్నదని చెప్పారు. ఈ కంపెనీల స్థాపన పూర్తయిన తర్వాత సుమారు మూడు లక్షల ఎకరాల్లోని తెలంగాణ పత్తి ని కంపెనీ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కంపెనీ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అధికంగా అవకాశాలు వచ్చేలా, వారికి అవసరమైన శిక్షణ కార్యకలాపాలను ప్రభుత్వం తరఫున చేపడతామని చెప్పారు. అందుకని స్థానిక మహిళా సంఘాలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. సీఎస్ఆర్ కింద రూ.6 కోట్ల విలువ చేసే పీపీఈ కిట్లు కైటెక్స్ ఇవ్వనుందన్నారు.
మంత్రి కేటీఆర్ చూపిన చొరవ వల్లే తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల వాతావరణం, విధానాలు నచ్చాయని చెపపారు. 3 మిలియన్ దుస్తులను ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తామని సాబూ ఎం జాకబ్ వెల్లడించారు. అంతేకాదు చిన్న పిల్లల వస్త్రాల తయారీలో ప్రత్యేకమైన కంపెనీ. కంపెనీ నుంచి తయారైన వస్త్రాలు ధరించని పసి పిల్లలు అమెరికాలో ఉండరని చెప్పేందుకు గర్వకారణంగా ఉందని అన్నారు. కేరళ నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్న తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావడానికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ గారి ని కలిసినప్పుడు తనకు పెట్టుబడి కన్నా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలని అడిగారు. ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత తమ వెయ్యి కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడిని 2400 కోట్లకు పెంచాము. దీంతో 22000 ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచి 3 మిలియన్ల వస్త్రాలను అమెరికాకి ఎగుమతి చేస్తామని చెప్పారు. లక్షన్నర కిట్లను తెలంగాణ ప్రభుత్వానికి తమ కంపెనీ తరఫున అందిస్తామని తెలిపారు. ఇక వచ్చే నవంబర్ నుంచి కైటెక్స్ గ్రూప్ తమ ఉత్పత్తులను ప్రారంభించనుంది.
Delighted & excited to share that KITEX group has expanded their investment plans in Telangana to ₹2,400 Cr ?
Direct employment to 22,000 & indirectly to 18,000
Manufacturing locations at Warangal (Kakatiya Mega Textile Park) and Sitarampur in Rangareddy district pic.twitter.com/xvuQny98As
— KTR (@KTRTRS) September 18, 2021
Also Read: ఆడపిల్లను కాపాడే ఉద్యమం చేస్తున్న ఓ డాక్టర్.. తన ఆస్పత్రిలో ఆడపిల్ల జన్మిస్తే ఫీజు మాఫీ.. ఎక్కడంటే..