Dr Ganesh Rakh: ఆడపిల్లను కాపాడే ఉద్యమం చేస్తున్న ఓ డాక్టర్.. తన ఆస్పత్రిలో ఆడపిల్ల జన్మిస్తే ఫీజు మాఫీ.. ఎక్కడంటే

Dr Ganesh Rakh: ప్రకృతి, పురుషుడు అపుడు కదా సృష్టి.. ఇద్దరిని సమాన దృష్టితో చూడమని లింగ వివక్షత తగదని.. ప్రభుత్వం, అధికారులు ఎన్ని విధాలుగా అవేర్నెస్ ప్రోగ్రాములు చేపట్టినా..

Dr Ganesh Rakh: ఆడపిల్లను కాపాడే ఉద్యమం చేస్తున్న ఓ డాక్టర్.. తన ఆస్పత్రిలో ఆడపిల్ల జన్మిస్తే ఫీజు మాఫీ.. ఎక్కడంటే
Dr Ganesh Rakh
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2021 | 5:10 PM

Dr Ganesh Rakh: ప్రకృతి, పురుషుడు అపుడు కదా సృష్టి.. ఇద్దరిని సమాన దృష్టితో చూడమని లింగ వివక్షత తగదని.. ప్రభుత్వం, అధికారులు ఎన్ని విధాలుగా అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తున్నా చదువులేనివారే కాదు.. చదువు, ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు చాలామంది.. ఆడ, మగ తేడా చూపిస్తున్నారు. ఇక కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలియగానే.. భూమి మీద పడకుండానే చంపేస్తున్నా తల్లిదండ్రులకు కొదవేలేదు.. ఇక ప్రస్తుత జనాభా నిష్పత్తిలో కూడా ఆడవారి కంటే మగవారు అధికంగా ఉన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అనేక మంది హెచ్చరిస్తున్నారు. అయితే ఓ డాక్టర్ తన పరిధిలో ఆడపిల్లకు ఊపిరిపోయడానికి ప్రయాణిస్తున్నాడు. మంచి పనులు చేస్తూ.. స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సమాజంలో పాతుకుపోయిన లింగవివక్షను రూపుమాపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ డాక్టర్ పేరు గణేశ్ రాఖ్.

మహారాష్ట్రలోని పుణేలో హదాప్సర్ ప్రాంతంలో గణేష్ రాఖ్ కు ఓ ఆస్పత్రి ఉంది. అయితే తన ఆసుపత్రిలో ఏ మహిళ అయినా పురుడుపోసుకుంటే.. అప్పుడు ఆడపిల్ల పుడితే పీజు తీసుకోవడం లేదు.   . సర్వసాధారణంగా చిన్న ఆస్పత్రిలో సైతం సాధారణ ప్రసవం జరిగితే.. రూ.10 వేలనుంచి , సిజేరియన్ కు రూ.25 వేలు పైన తీసుకుంటారు. అయితే గణేష్ ఆస్పత్రిలో పుట్టిన ఆడపిల్ల తల్లిదండ్రులనుంచి ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోరు. పైగా ఆడపిల్ల పుడితే ఆస్పత్రి సిబ్బంది స్వీట్లు, కేసులు పంచుతారు. ఇప్పటివరకు గణేష్ కొన్ని వందల మంది మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.

ఇదే విషయంపై గణేష్ స్పందిస్తూ.. డెలివరీ టైం లో తల్లిదండ్రులు పుట్టేది బాబా, పాపా అని ఆందోళన చెందుతుంటారు. అబ్బాయి పుడితే తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు సంతోషంతో పండగ చేసుకుంటారు. కొంతమంది స్వీట్స్ కూడా పంచిపెడతారు. అయితే అమ్మాయి పుడితే బాధపడతారు.  కన్నీరు పెట్టున్న మహిళలను కూడా తాను చూశానని చెప్పారు. ఐతే ఇలాంటి సంఘంటలు జరగడం ఇది నిజంగా బాధాకరమని.. లింగ వివక్షను రూపుమాపాలని తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు.  2007 నుంచి ఉచితంగా వైద్య సేవలు  డాక్టర్ గణేశ్ రాఖ్ అందిస్తున్నారు.  అయితే దీనికి ప్రేరణ జనాభా లెక్కలో ఉన్న తేడా అని 1961 లో, ఏడేళ్లలోపు ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 976 మంది బాలికలు ఉన్నారు. అదే 2011 లో విడుదల చేసిన తాజా జనగణన గణాంకాల ప్రకారం, ఆ సంఖ్య 914 కి దిగజారిందని తెలిపారు. అంతేకాదు ఆడపిల్ల బరువు అనే ఆలోచనా విధానంలో మార్పురావాలని డాక్టర్ కోరుతున్నారు. ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.  అంతేకాదు ఆస్పత్రి వెబ్ సైట్ ద్వారా కూడా ఆడపిల్ల రక్షణ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.

Also Read: Sai Daram Tej: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వెంటిలేటర్ తొలగించిన అపోలో వైద్యులు..