Oil India Limited Recruitment: ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు… దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడంటే..

Oil India Limited Recruitment 2021: ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అసోంలో ఉన్న ఈ సంస్థలో పలు...

Oil India Limited Recruitment: ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 18, 2021 | 8:30 PM

Oil India Limited Recruitment 2021: ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అసోంలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 21తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. * ఎలక్ట్రికల్‌ అండ్‌ కేథోడిక్‌, టెలీకమ్యూనికేషన్, ఫిట్టింగ్‌, సివిల్‌, ఆపరేషన్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి పదో తరగతి నుంచి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్‌ ఉండాలి. * అభ్యర్థుల వయసు 21-09-2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 26,600 నుంచి రూ. 37,500 వరకు చెల్లిస్తారు. * అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్ష, మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. * దరఖాస్తుల స్వీకరణ 21-09-2021తో ముగియనుంది. * పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Weight Loss: మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..! కచ్చితంగా ఈ 3 విషయాలు తెలుసుకోండి..

శరీరంలో యూరిక్ యాసిడ్‌ పెరిగితే ఏం జరుగుతుంది..? ఎలాంటి సమస్యలు ఏర్పడుతాయో తెలుసుకోండి..

ATA: ఆటా మహాసభల కోసం ఫండ్‌రైజింగ్‌‌ ఈవెంట్‌కు అనూహ్య స్పందన..