BEL Jobs 2022: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. బీఈ/బీటెక్‌ పూర్తి చేసిన వారు అర్హులు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Ghaziabad).. 50 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (Graduate Apprentice Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

BEL Jobs 2022: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. బీఈ/బీటెక్‌ పూర్తి చేసిన వారు అర్హులు..
Bel Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 16, 2022 | 2:52 PM

BEL Ghaziabad Graduate Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Ghaziabad).. 50 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (Graduate Apprentice Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ & ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.11,100ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కంప్యూటర్ సైన్స్ పోస్టులు: 10
  • సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు:10
  • ఎలక్ట్రానిక్స్ పోస్టులు: 10
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు: 20

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.