Results: సీయూఈటీ-యూజీ ఫలితాలు విడుదల.. దేశవ్యాప్తంగా తొలిసారి 99 యూనివర్సిటీల్లో ఒకేసారి ప్రవేశాలు..
CUET UG 2022 Results: యూజీ ఫలితాలను విడుదల చేసింది జాతీయ పరీక్షల మండలి (NTA). దేశవ్యాప్తంగా 259 నగరాలు/పట్టణాల్లో 489 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తంగా..
ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(CUET UG 2022)-యూజీ ఫలితాలను విడుదల చేసింది జాతీయ పరీక్షల మండలి (NTA). దేశవ్యాప్తంగా 259 నగరాలు/పట్టణాల్లో 489 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తంగా ఆరు దశలుగా జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 14.9లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు. 44 సెంట్రల్ యూనివర్సిటీలు, 12 స్టేట్ యూనివర్సిటీలు 11 డీమ్డ్ యూనివర్సిటీలు, 19 ప్రయివేటు వర్సిటీలతో కలిపి దేశవ్యాప్తంగా 99 విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటిసారి ఈ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఈ ఫలితాలు విడుదల చేసినట్టు ఎన్‌టీఏ తెలిపింది. ఫలితాలను వెబ్‌సైట్ కానీ సమర్త్ వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు. మరోవైపు, యూనివర్సిటీలు కొత్త విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ ఆఖర్లో లేదా నవంబర్ తొలి వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ తెలిపారు.
అయితే.. NTA CUET-UG ఫలితాలను సెప్టెంబర్ 15వ తేదీలోగా లేదా వీలైతే రెండు రోజుల ముందుగా ప్రకటిస్తుందని UGC ఛైర్మన్ జగదీష్ కుమార్ గత వారం ప్రకటించారు. అన్నట్లుగానే ఫలితాలను కొన్ని గంటలు అటు.. ఇటుగా ప్రకటించారు.
CUET (UG) 2022 Results declared. pic.twitter.com/OkSLNHT5yD
— National Testing Agency (@DG_NTA) September 15, 2022
అదే సమయంలో అభ్యర్థులు తమ జవాబు కీలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో ఇక్కడ చూడండి:
- అధికారిక వెబ్‌సైట్ కి లాగిన్ అవ్వండి.
- వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కనిపించే ‘CUET UG 2022 తాత్కాలిక సమాధాన కీ డౌన్‌లోడ్’ లింక్‌పై క్లిక్ చేయండి.
- విద్యార్థులు ఇప్పుడు వారి రోల్ నంబర్, ఇతర వివరాలతో పాటు పుట్టిన తేదీ వంటి లాగిన్ ఆధారాలను పూరించాలి.
- ఇప్పుడు, అభ్యర్థులు లాగిన్ పేజీలో సమర్పించుపై నొక్కాలి..
- ఆన్సర్ కీ ఇప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అభ్యర్థులు ఇప్పుడు జవాబు కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం