ARIES Recruitment 2021: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ఏఆర్‌ఐఈఎస్).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు జారీ చేశారు. * మొత్తం 11 ఖాళీలకు గాను పర్సనల్ అసిస్టెంట్–01, ఇంజనీరింగ్ అసిస్టెంట్–02, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్–04, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్–02, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–02 పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైనత తెలిపిన పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో రెండేళ్ల ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి. * అభ్యర్థుల వయసు 27ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రాతపరీక్ష/స్కిల్ టెస్ట్‌తో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. * ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 24-09-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Twin Elephants: ఆ దేశంలో 80 ఏళ్ల తర్వాత కవల ఏనుగులు జననం… తల్లితో సంతోషంగా ఆడుకుంటున్న గున్న ఏనుగులు
Tollywood Drugs Case: ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఛార్మి.. కార్యాలయం దగ్గర బౌన్సర్ల హంగామా..