Amazon: అమెజాన్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు.. కీలక ప్రకటన చేసిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జాస్సీ..

Amazon: ‘అమెజాన్.కామ్’ ను మరింత విస్తృతం చేయాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ చేపట్టేందుకు సిద్ధమైంది.

Amazon: అమెజాన్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు.. కీలక ప్రకటన చేసిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జాస్సీ..
Amazon
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 02, 2021 | 6:24 AM

Amazon: ‘అమెజాన్.కామ్’ ను మరింత విస్తృతం చేయాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ చేపట్టేందుకు సిద్ధమైంది. రానున్న నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 55 వేల మందిని నూతనంగా నియమించనున్నట్లు అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆండీ జాస్సీ వెల్లడించారు. ఇదిలాఉంటే, అమెజాన్‌లో ఉన్న ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే.. జూన్ 30 నాటికి గూగుల్ హెడ్ కౌంట్‌లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఫేస్‌బుక్ సిబ్బందికి దగ్గరగా ఉంది.

అమెజాన్ అగ్రస్థానంలో నిలిచిన తరువాత తొలిసారి ఇంటర్వ్యూలో మాట్లాడిన జస్సీ.. రిటైల్, క్లౌడ్, అడ్వర్టైజింగ్ వంటి ఇతర వ్యాపారాలలో డిమాండ్‌ను కొనసాగించడానికి కంపెనీకి మరింత ఫైర్ వర్క్ అవసరం అని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే.. బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ని విస్తరించేందుకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడం కంపెనీకి ఛాలెజింగ్ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు కైపర్ కోసం కొత్త నియామకాలు అవసరం అని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగాంగానే టెక్నాలజీ పరంగా నియామకాలు చేపడుతున్నామని చెప్పారు.

అమెజాన్ వార్షిక జాబ్‌ మేళా సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నియామకాలకు ఇదే మంచి సమయం అని జాస్సీ భావిస్తున్నారు. ‘‘కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎంతో మంది ఉద్యోగాలు ఉడిపోయాయి. చాలా మందికి స్థానచలనం కలిగింది. కొత్త, నూతన ఒరవడితో కూడిన ఉద్యోగాల గురించి ఆలోచించే వారు కూడా ఉన్నారు.’’ అంటూ పీడబ్ల్యూ సర్వేను ఉదహరించారు జాస్సీ. 65 శాతం మంది ఉద్యోగులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

‘‘’https://www.amazoncareerday.com’లో ఉద్యోగం సమయానుకూలంగా, ఉపయోగకరంగా ఉంటుంది.’’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త నియామకాలు అమెజాన్ టెక్, కార్పొరేట్ సిబ్బందిలో 20% పెరుగుదలను సూచిస్తాయని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2,75,000 మంది సిబ్బంది ఉన్నారని కంపెనీ తెలిపింది.

కాగా, ఈ నియామకాలకు సంబంధించి కంపెనీ ప్రయోగానికి తెరలేపిందని కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో అలబామాలోని అమెజాన్ సిబ్బంది.. అమెజాన్ యాజమాన్యం తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. యూనియన్‌లకు వ్యతిరేకంగా అమెజాన్ వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఎంప్లాయిస్ విషయంలో అమెజాన్‌కు మరింత సాఫ్ట్ కార్నర్ అవసరం అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇదే వివాదంపై స్పందించిన జాస్సీ.. ‘‘కంపెనీలో ప్రతిఒక్కరికీ స్వేచ్ఛ ఉంది. మరింత మెరుగ్గా పని చేసేందుకు విమర్శనాత్మకంగా చూడటం, పనితీరును మెరుగు పరిచే మార్గాలను కనిపెట్టడం చాలా అవసరం.’’ అని పేర్కొన్నారు. అమెజాన్ కంపెనీ మార్కెటింగ్ చేస్తున్న ప్రాంతాల్లో ఇంజినీరింగ్, రీసెర్చ్ సైన్స్, రోబోటిక్స్ రోల్స్ ఉన్నాయని, ఇతరులు విడిచిపెట్టిన ఉద్యోగాల కంటే కంపెనీలో ఎక్కువగా కొత్త పోస్టింగ్‌లు ఉన్నాయని అన్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా కొన్ని కంపెనీలు తమ సంస్థలో ఖాళీలను భర్తీ చేయడానికి.. టెక్నికల్, మాన్యువల్ వర్క్‌ని సమతుల్యం చేయలేక తీవ్ర అవస్థలు పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఇంతకు ముందు “ఆఫీస్-సెంట్రిక్ కల్చర్” అని ప్రచారం చేసిన అమెజాన్.. వచ్చే ఏడాది నుండి కార్మికులకు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వ్యక్తిగతంగా కార్యాలయాలలో పనిచేసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. అమెరికాలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్య కంపెనీ అయిన అమెజాన్.. 2020 సంవత్సరం వరకు ప్రపంచ వ్యాప్తంగా 5,00,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. వీరిలో ఎక్కువగా గిడ్డంగి, డెలివరీ కార్యకలాపాల కోసం నియమించుకుంది. ఈ బిజినెస్‌లో అమెజాన్ గణనీయమైన టర్నోవర్ కలిగి ఉంది.

కస్టమర్ల నుంచి మరింత ఆదరణ పొందేందుకు, వారికి సౌకర్యవంతంగా సమయానికి ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు మరిన్ని గిడ్డంగులను నిర్మించడానికి, కార్మికులకు వేతనాన్ని పెంచడానికి కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ‘‘పరిహారం విషయంలో చాలా పోటీతత్వంతో ఉన్నాం. మేము కనీసం వేతనం 15 డాలర్లు ఉండేందుకు కారణం అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో సగటున ప్రారంభ వేతనం గంటకు 17 డాలర్లు.’’ అని జాస్సీ పేర్కొన్నారు. కాగా, జాస్సీ ప్రకటించిన 55,000 ఉద్యోగాలలో, 40,000 పైగా ఉద్యోగాలు యునైటెడ్ స్టేట్స్‌లోనే కావడం విశేషం. మిగతా పోస్టులను ఇండియా, జర్మనీ, జపాన్ వంటి దేశాలలో నియమిస్తారు.

Also read:

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాల వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..

Viral Video: స్మిమ్మింగ్‌పూల్‌లోకి ఊహించని అతిథి.. దెబ్బకు జడుసుకుని పరుగులు తీసిన జనాలు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరంతే..

TV9 Effect: వేటు పడింది.. విచారణ మొదలైంది.. లాల్ స్ట్రీట్ పబ్‌పై చర్యలకు సిద్ధమైన పోలీసులు..