Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాల వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్లతో అమెరికా యుద్ధం ముగించింది. సరిగ్గా 20 ఏళ్ల తరువాత తాలిబన్ల రాజ్యాన్ని వీడింది అమెరికా సైన్యం.
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్లతో అమెరికా యుద్ధం ముగించింది. సరిగ్గా 20 ఏళ్ల తరువాత తాలిబన్ల రాజ్యాన్ని వీడింది అమెరికా సైన్యం. సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడి నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్‌లోకి ప్రవేశించిన అమెరికన్ సేనలు.. మొన్నటితో సంపూర్ణంగా వెనక్కి వెళ్లిపోయాయి. అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిన దరిమిలా ఆఫ్గనిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం అత్యంత భయానకంగా ఉన్నాయి. ఇక ఆఫ్గనిస్తాన్‌ను విడిచిన వెళ్లిన అమెరికన్ సైన్యం వెళుతూ.. వెళుతూ.. తమ ఆయుధ సంపత్తినంతా అక్కడే వదిలి వెళ్లింది. దాంతో ఆ ఆయుధ సంపత్తి అంతా తాలిబన్ల వశం అయ్యింది. అయితే, అమెరికా వదిలివెళ్లిన ఆయుధాల విలువ కొన్ని వేల కోట్లలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికన్ రాజకీయవేత్త ఆందోళన.. కాగా, అమెరికా సైన్యం భారీ స్థాయిలో ఆయుధ సంపత్తిని ఆఫ్గనిస్తాన్‌లోనే వదిలి రావడంపై అమెరికాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు జిమ్ బ్యాంక్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 86 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన యూఎస్ మిలిటరీ ఆయుధాలు తాలిబన్ల చేతిలో ఉన్నాయని ఆయన చెప్పారు. తాలిబన్ల వద్ద ప్రస్తుతం 75 వేల వాహనాలు, 200 లక పైగా విమానాలు, హెలికాప్టర్లు, 6 లక్షల చిన్న, తేలికపాటి ఆయుధాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ ఆయుధాలు ఉన్నాయంటే.. 1.తాలిబాన్లు ప్రస్తుతం M113A2 వంటి వ్యక్తిగత క్యారియర్‌లను కలిగి ఉన్నారు. ఒక్కో క్యారియర్‌కు 1,70,000 డాలర్లు ఖర్చు అవుతుంది. 2. 4,12,000 నుండి 7,67,000 డాలర్ల వరకు ఖరీదు చేసే రెస్క్యూ వాహనాలు కూడా ప్రస్తుతం తాలిబాన్ల ఆధీనంలో ఉన్నాయి. 3. 1,04,682 డాలర్ల ధర కలిగిన ఒక హమ్వీ, యుటిలిటీ హమ్వీ($ 91,429) ప్రస్తుతం తాలిబాన్ల వద్ద ఉంది. 4. బ్లాక్ హాక్ హెలికాప్టర్ ధర 21 మిలియన్ల డాలర్లు. 5. 2013 లో యుఎస్ 20 A-29 సూపర్ టుకానో ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. వీటి ధర 427 మిలియన్ల డాలర్లు. ఒక విమానం ధర 21.3 మిలియన్ల డాలర్లు. 6. 2018 మార్చిలో, ఆఫ్గన్ ఎయిర్ ఫోర్స్ సి -208 లైట్ ఎటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు విమానాలకు 84.6 మిలియన్ డాలర్లు. దీనికి హెలిఫైర్ క్షిపణి, ట్యాంక్ నిరోధక క్షిపణి, ఇతర ఆయుధాలు అమర్చబడ్డాయి.
అమెరికాకు సంబంధించి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి.. తాలిబన్ల వద్ద ప్రస్తుతం హమ్వీస్, చినుక్ హెలికాప్టర్లు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి కాకుండా, నైట్ విజన్ గాగుల్స్, రక్షణ కవచాలు, వైద్య సామాగ్రి కూడా ఉన్నాయి. 2003, 2016 మధ్య, అమెరికా 75,896 వాహనాలు, 208 విమానాలను ఆఫ్గన్ సైన్యం, భద్రతా దళాల కోసం కొనుగోలు చేసింది. అమెరికా వదిలిపెట్టిన ఆయుధాలు, సామగ్రి వాస్తవానికి ఆఫ్గన్ దళాలకు సంబంధించిన ఆయుధాలు. 2003 నుండి అమెరికా M16 రైఫిల్స్, 162,000 కమ్యూనికేషన్ పరికరాలు, 16,000 నైట్ విజన్ గాగుల్స్‌తో సహా 6,00,000 పదాతిదళ ఆయుధాలను ఆఫ్గన్ దళాలకు సరఫరా చేసింది. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం (GAO) ద్వారా ఇవ్వబడ్డాయి.
తాలిబాన్ వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయి.. 1. హుమ్వి – 2,21,74 2. M1117 – 634 3. MxxPro మైన్ ప్రూఫ్ వాహనాలు – 155 4. M113 – 169 5. పికప్ ట్రక్కులు మరియు SUV లు – 42,000 6. మెషిన్ గన్స్ – 64,363 7. ట్రక్కులు – 8,000 8. రేడియో – 1,62,043 9. నైట్ విజన్ గాగుల్స్ – 16,035 10. అటాక్ రైఫిల్స్ – 3,58,530 11. తుపాకులు – 1,26,295 12. ఆర్టిలరీ పీసెస్ – 176
ఆడిట్ దాచే పనిలో బిడెన్ పరిపాలనా యంత్రాంగం.. ఆగస్టు 15 న తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆఫ్గనిస్తాన్ పూర్తిగా తాలిబాన్ల వశమైపోయింది. ఆఫ్ఘన్ భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడానికి అమెరికా 83 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 2021 సంవత్సరంలో, యుఎస్ మిలిటరీ మాత్రమే ఆఫ్ఘన్ దళాలకు 3 బిలియన్ డాలర్ల సహాయాన్ని చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలిపెట్టిన ఆయుధాల ధరను అంచనా వేయడం కొంచెం కష్టం. కానీ దాని విలువ అనేక బిలియన్ డాలర్లు ఉంటుందని మాత్రం చెప్పొచ్చంటున్నారు. ఇది మాత్రమే కాదు, బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్గన్ సైనిక పరికరాలకు సంబంధించిన ఆడిట్‌ను కూడా దాచిపెట్టినట్లు కథనాలు వస్తున్నాయి.
Also read:
TV9 Effect: వేటు పడింది.. విచారణ మొదలైంది.. లాల్ స్ట్రీట్ పబ్‌పై చర్యలకు సిద్ధమైన పోలీసులు..