Viral Video: స్మిమ్మింగ్‌పూల్‌లోకి ఊహించని అతిథి.. దెబ్బకు జడుసుకుని పరుగులు తీసిన జనాలు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరంతే..
Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు
Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వాటిని ఫోటోలు తీయడం కోసం తరచుగా అడవుల్లోనే తిరుగుతుంటారు. గంటలు గంటలు అడవిలోనే గడుపుతుంటారు. ఆ సందర్భంగా వారు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. వాటిల్లో కొన్ని వైరల్‌గా మారుతాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తి జనావాసాల్లో సంచరించే ఆవు కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆవు చేసిన పని చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. ఆవులు సహజంగా చెరువుల్లో స్నానం చేయడం చూసుంటారు. కానీ ఈ ఆవు మాత్రం స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తోంది. అయితే, ఈ సమయంలో కొందరిని హడలెత్తించింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వీడియోలో ఓ ఆవు స్మిమ్మింగ్ పూల్ వద్దకు వచ్చి నిలబడుతుంది. అందులో అప్పటికే ఇద్దరు వ్యక్తులు స్విమ్మంగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక స్విమ్మింగ్ పూల్‌కు పైన్ ఉన్న ఆవు.. చూస్తూ చూస్తు ఒక్కసారిగా అందులోకి దూకేస్తుంది. ఇలా ఈదుకుంటూ అందులో ఉన్న మనుషుల వద్దకు వెళ్తుంది. ఆవు రాకను గమనించిన అందులోని వ్యక్తులు భయంతో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆవు మాత్రం ఎంచక్కా ఈత కొడుతూ స్విమ్మింగ్ పూల్ మొత్తం కలియ తిరుగుతుంది. తొలుత స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ తరువాత ఈతను ఆస్వాదించింది ఆ ఆవు. స్విమ్మింగ్‌లో ఆవు ఈత కొడుతుంగా.. దూరంగా ఉన్న వ్యక్తి వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో Instagram లో _hayate_vahsh2 అనే పేజీలో షేర్ చేయగా.. నెటిజన్లు ఇది చూసి ఫిదా అయిపోతున్నారు. స్వి్మ్మింగ్ పూల్ లోని వ్యక్తులు భయంతో పరుగులు తీయడం నవ్వు తెప్పిస్తుంటే.. ఆవు సరదాగా జలకాలాడటం చూడ ముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఆవు ఈత కొట్టడం ఇదే తొలిసారి అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Viral Video:
View this post on Instagram
Also read:
Beware: మీరు బీమా పాలసీ తీసుకుంటున్నారా? అయితే, ఇది తెలుసుకోండి.. లేదంటే అంతేసంగతులు..
TV9 Effect: వేటు పడింది.. విచారణ మొదలైంది.. లాల్ స్ట్రీట్ పబ్‌పై చర్యలకు సిద్ధమైన పోలీసులు..