Beware: మీరు బీమా పాలసీ తీసుకుంటున్నారా? అయితే, ఇది తెలుసుకోండి.. లేదంటే అంతేసంగతులు..
Beware: బీమా పాలసీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన కస్టమర్లను, ప్రజలను హెచ్చరించింది.
Beware: బీమా పాలసీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన కస్టమర్లను, ప్రజలను హెచ్చరించింది. బీమా పాలసీ కొనుగోళ్లలో మోసగాళ్లు అందించే నకిలీ డాక్యూమెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలనే టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రుణాలు పొందడానికి ముందస్తు షరతుగా జీవిత బీమాను తప్పనిసరిగా చేసి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రతినిధిగా కూడా నటిస్తున్నారు. జీవిత బీమా ప్రీమియం మొత్తం.. రుణ గ్రహీతలు కోరుకునే రుణ మొత్తంలో కొంత శాతంగా ఉంటుందని పేర్కొంటూ బీమా పాలసీని కొనుగోలు చేయడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.’’ అని బజాజ్ ఫైనాన్స్ పేర్కొంది.
బజాజ్ ఫైనాన్స్ ప్రకారం మోసగాళ్లు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారంటే.. బజాజ్ ఫైనాన్స్ ఏజెంట్‌గా వచ్చే మోసగాళ్లు.. కస్టమర్లకు బీమా పాలసీని ఎరగా చూపుతారు. రుణం పొందాలంటే బీమా పాలసీని తీసుకోవాలని చెబుతున్నారు. దీనికి సంబంధించి బీమా కంపెనీ నుంచి అన్ని రకాల బీమా పత్రాలను అందజేయడం జరుగుతుందని నమ్మబలుకుతారు. అలా ముందుగా బీమా సొమ్మును కస్టమర్ల నుంచి తీసుకుంటారు. కొంతకాలం పాటు.. కస్టమర్‌తో సంబంధాలు కొనసాగిస్తారు. రుణానికి సంబంధించి అడిగితే మాత్రం దాటవేస్తూ వస్తారు. వాస్తవానికి బీమా పాలసీల్లో 90 రోజు ఫ్రీ లుక్ పిరియడ్ ఉంటుంది. ఈ సమయంలో కస్టమర్ తన పాలసీని రద్దు చేసుకోవచ్చు. ఇలా చేస్తే.. తాను చెల్లించిన ప్రీమియం ను కూడా కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. అయితే, ఈ ఫ్రీ లుక్ పిరియడ్ ముగిసిన తరువాత మాయగాళ్లు.. అప్పటి వరకు కాంటాక్ట్‌లో ఉన్న కస్టమర్‌కు అన్సార్ చేయడం మానేస్తారు. అచ్చంగా ఇలాగే ఓ వ్యక్తి మోసపోగా.. సదరు బాధితుడు బజాన్ ఫైనాన్స్‌ను ఆశ్రయించాడు. తాను మోసపోయిన విదానాన్ని కంపెనీకి వివరించాడు. దాంతో అలర్ట్ అయిన బజాజ్ ఫైనాన్స్.. తన కస్టమర్లకు హెచ్చరిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్ల ట్రాప్‌లో పడొద్దని సూచించింది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రుణం పొందడానికి ఇతర ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని వినియోగదారులు, ప్రజలు గుర్తించుకోవాలని సూచించింది. మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని డబ్బులు కోల్పోవదని చెప్పింది.
Also read:
Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో గుట్టుగా వ్యభిచారం.. అది తెలిసిన పోలీసులు ఏం చేశారంటే..
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.. నిండుకుండలా రిజర్వాయర్లు, చెరువులు..
Assam Floods: అస్సాంను ముంచెత్తుతున్న వరదలు.. తినడానికి తిండి కూడా లేక జనం ఆర్తనాదాలు..