Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగి వస్తున్న పసిడి ధరలు.. తాజా ధరల వివరాలు..
Gold Price Today: దేశంలో బంగారం ధరలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు బంగారం ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతోంది. నిన్న స్వల్పంగా దిగి..
Gold Price Today: దేశంలో బంగారం ధరలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు బంగారం ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతోంది. నిన్న స్వల్పంగా దిగి వచ్చిన పసిడి ధరలు ఈ రోజు కూడా దిగి వచ్చాయి. అన్ని ప్రాంతాల్లో అన్ని ధరలు ఒకేలా ఉండవు. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు చేయడం మాత్రం ఆగరు. పది గ్రాముల ధరపై రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం (సెప్టెంబర్ 1న) ఉదయం ఆరు గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,720 ఉంది.
► ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,380 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.
► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,330 ఉంది.
అయితే బంగారం ధరలు తగ్గింపు, పెరుగుదలకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.