Apple: యాపిల్‌ నుంచి సరికొత్త టెక్నాలజీ.. సిమ్‌కార్డు.. నెట్‌వర్క్‌తో పని లేకుండా మొబైల్‌..!

Apple Satellite Connectivity: టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇక టెక్నాలజీ విషయంలో అనేక ఆవిష్కరణకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది యాపిల్‌..

Apple: యాపిల్‌ నుంచి సరికొత్త టెక్నాలజీ.. సిమ్‌కార్డు.. నెట్‌వర్క్‌తో పని లేకుండా మొబైల్‌..!
Follow us

|

Updated on: Aug 31, 2021 | 1:41 PM

Apple Satellite Connectivity: టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇక టెక్నాలజీ విషయంలో అనేక ఆవిష్కరణకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది యాపిల్‌. ఏదైనా ఫీచర్‌ని యాపిల్‌ అందుబాటులోకి తెచ్చిందంటే మిగిలిన కంపెనీలన్నీ అదే బాటలోనే నడుస్తాయి. మెటల్‌ బాడీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, టాప్‌నాచ్‌ ఒకటే కాదు.. ఇలా ఎంతో పాపులర్‌ ఫీచర్స్‌లో సగానికిపైగా యాపిల్‌ వల్లే ట్రెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటిని మించి మరో పాత్‌ బ్రేకింగ్‌ ఫీచర్‌ని యాపిల్‌ అందుబాటులోకి తేనుందని మార్కెట్‌ వర్కాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ ఫోన్లు అన్నీ కూడా నెట్‌వర్క్‌ ఆధారంగా రన్‌ అవుతాయి. 2జీ మొదలుకుని ఇప్పుడు ఎల్‌టీఈ, 5జీ వరకు వచ్చాము. శాటిలైట్‌ తరంగాల ఆధారంగా ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ఈ నెట్‌వర్క్‌లు పని చేస్తున్నాయి. అయితే వీటిని మించేలా భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా లియో టెక్నాలజీలో సిమ్‌తో అవసరం లేకుండా నేరుగా హ్యండ్‌సెట్‌ ద్వారానే ఇటు కాల్స్‌, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్‌ కొనసాగించే అవకాశం ఉంటుంది.

లియో టెక్నాలజీని అందిపుచ్చుకోనున్న యాపిల్‌

లియో టెక్నాలజీని ముందుగా అందిపుచ్చుకునేందుకు యాపిల్‌ చకచక అడుగులు వేస్తోంది. త్వరలో విడుదల చేయబోయే యాపిల్‌ 13 మోడల్‌ లియో ఆధారంగా పని చేసే అవకాశం ఉందని మార్కెట్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సిమ్‌కార్డు వేసుకుని మొబైల్‌ ఆపరేటర్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్నట్టుగా ప్రత్యేకంగా ఏమైనా రీఛార్జీలు ఉంటాయా? లేక హ్యండ్‌సెట్‌ ధరలోనే అ‍న్నీ అందుబాటులోకి తీసుకువస్తారా..? అనే అంశంపై చర్చ జరుగుతోంది. విషయమై యాపిల్‌ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

లియో అంటే ఏమిటి..?

నెట్‌వర్క్‌ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ప్రస్తుతం భూ వాతావరణం ఆవల ఉన్న శాటిలైట్లను ఉపయోగిస్తున్నారు. ఇకపై వాటితో సంబంధం లేకుండా భూమి నుంచి కేవలం 500 కి.మీ ఎత్తులో ఉండే లో ఎర్త్‌ ఆర్బిట్‌ ( Low-Earth Orbit (LEO -LEO) శాటిలైట్లను మొబైల్‌ కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగించుకోబోతున్నారు. దీని కోసం లో ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను ఉపయోగించేందుకు పెద్దపెద్ద సంస్థలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెజాన్‌, ఎయిర్‌టెల్‌, స్పేస్‌ఎక్స్‌, టాటా, టెలిశాట్‌ వంటి కంపెనీలు ఈ పనిలో బిజీగా ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

Digital Library: అరచేతిలో గ్రంథాలయం.. విజ్ఞానాన్ని అందించే డిజిటల్‌ లైబ్రరీ యాప్‌.. 4 కోట్లకుపైగా పుస్తకాలు..

Chinese Apps: భారత్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న చైనా యాప్స్‌.. మూలాలు తెలియకుండా జాగ్రత్త..!