షాకింగ్‌.. ఈ కారు దానికదే స్పీడ్‌గా వెళ్లి పోలీస్‌ వాహనాన్ని ఢీ కొట్టింది..! తర్వాత ఏం జరిగిందంటే..

Tesla Car Incident: మీకు ఖరీదైన కార్లంటే ఇష్టమా.. అయితే మీరు తప్పకుండా ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ప్రపంచ

షాకింగ్‌.. ఈ కారు దానికదే స్పీడ్‌గా వెళ్లి పోలీస్‌ వాహనాన్ని ఢీ కొట్టింది..! తర్వాత ఏం జరిగిందంటే..
Tesla Car Incident
Follow us
uppula Raju

|

Updated on: Aug 31, 2021 | 5:44 PM

Tesla Car Incident: మీకు ఖరీదైన కార్లంటే ఇష్టమా.. అయితే మీరు తప్పకుండా ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించాయి. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. మార్కెట్లో ఏ కారు కూడా ఈ కంపెనీ కార్లకు సరితూగవు. ఇందులో కొన్ని డ్రైవర్ లేకుండా రోడ్డుపై నడిచే కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు సమస్య అంతా ఈ కార్ల గురించే. ప్రస్తుతం టెస్లా కార్లలో ఉండే ఆటో పైలట్ మోడ్ ద్వారా డ్రైవర్‌ లేకుండా ప్రయాణించవచ్చు.

దీంతో చాలామంది వీటిని రోడ్లపై వదిలేస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఘటన జరిగింది. ఆటో పైలట్ మోడ్‌లో నడుస్తున్న కారు ఒకటి వేగంగా వచ్చి పోలీస్‌ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఆ కారు తుక్కు తుక్కుగా మారింది. ఈ ప్రమాదం ఉదయం 5 గంటలకు జరిగింది. ఈ లోపం కారణంగా ఈ కార్లు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పోలీసు కారు ఎమర్జెన్సీ లైట్ కూడా ఆన్‌లో ఉంది అయినా కూడా టెస్లా కారు దానిని ఢీకొట్టింది.

ఆ సమయంలో వాహనంలో 27 ఏళ్ల యువకుడు ఉన్నాడు. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. గతంలో కూడా ఆటో పైలట్ మోడ్ కారణంగా టెస్లా కారు చాలా వాహనాలను ఢీ కొట్టిన సంఘటనలు ఉన్నాయి. అందుకే టెస్లా ఈ టెక్నాలజీ గురించి ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. టెస్లా కారణంగా ఇలాంటి ప్రమాదం జరగడం ఇది మొదటి సారి మాత్రం కాదు. 2018 సంవత్సరంలో ఒకేసారి 11 కార్లు ఢీకొన్నాయి. దీని వెనుక కారణం టెస్లా. ఆ సమయంలో కూడా టెస్లా కారు ఆటో పైలట్ మోడ్‌లో ఉంది. ఇందులో 17 మంది గాయపడగా ఒకరు మరణించారు. ఇది కాకుండా ఆటో పైలట్ మోడ్ కారణంగా చాలా ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి.

Minister Adi Moolapu Suresh: ఏపీలో 94 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి.. వివరాలు వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేష్..

Bigg Boss Himaja: నటి.. బిగ్‌బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో అద్భుతం.. సాయిబాబా విగ్రహం నుంచి విబూది..

AP Corona Cases: ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కొత్తగా 1,115 మందికి కరోనా..