Digital Library: అరచేతిలో గ్రంథాలయం.. విజ్ఞానాన్ని అందించే డిజిటల్‌ లైబ్రరీ యాప్‌.. 4 కోట్లకుపైగా పుస్తకాలు..

Digital Library: కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదికిపైగా గ్రంథలయాలు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఒక వేళ తెరిచినా పాఠకులు..

Digital Library: అరచేతిలో గ్రంథాలయం.. విజ్ఞానాన్ని అందించే డిజిటల్‌ లైబ్రరీ యాప్‌.. 4 కోట్లకుపైగా పుస్తకాలు..
National Digital Library Of India
Follow us
Subhash Goud

|

Updated on: Aug 31, 2021 | 12:07 PM

Digital Library: కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదికిపైగా గ్రంథలయాలు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఒక వేళ తెరిచినా పాఠకులు రాలేని పరిస్థితి. లైబ్రరీలు తెరుచుకున్న సమయంలో పాఠకులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు తమకు కావలసిన పుస్తకాలను చదవలేక పోతున్నారు. సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లో మునిగిపోతున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం కేంద్రం అరచేతిలోనే విజ్ఞానాన్ని అందించే ‘డిజిటల్‌ లైబ్రరీ’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

నిరుద్యోగులు, యువకులు సద్వినియోగం చేసుకునేలా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసి ‘నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో అరచేతిలో డిజిటల్‌ లైబ్రరీ రూపుదిద్దుకుంది. ఇందులో 4 కోట్లకు పైగా పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడి, అవసరమయ్యే విజ్ఞానాన్ని పంచనున్నాయి.

ఖరగ్‌పూర్‌ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో

కాగా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతితో ఖరగ్‌పూర్‌ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌నెట్‌లో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా పేరుతో డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇందులో విషయ నిపుణుల వీడియోలను కూడా ఉన్నాయి. పాఠశాల, కళాశాల, ఇంజనీరింగ్, వైద్య, న్యాయ విద్య, సాహిత్యం, సంస్కృతం ఇలా అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భాషల్లో ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు.

పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలలో..

పోటీ పరీక్షలకు కావలసిన అన్ని అంశాలను పొందుపర్చారు. పాఠశాల పుస్తకాలు(సీబీఎస్‌ఈ సిలబస్‌), ఇంజనీరింగ్‌ పుస్తకాలు, లిట్రేచర్, మెడిసిన్, లా మేనేజ్‌మెంట్, ఇతర మతపరమైన గ్రంథాలు, వివిధ రకాల పుస్తకాలు వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకాలన్ని పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ఉండగా, వెబ్‌సైట్‌ ఒపెన్‌ చేసి చదువుకోవచ్చు లేదా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా, స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ లేదా డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ల ద్వారా డిజిటల్‌ లైబ్రరీని వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. ఇంటర్‌నెట్‌ గూగుల్‌లో ‘నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ టైప్‌ చేస్తే డిజిటల్‌ లైబ్రరీ తెరుచుకుంటుంది. ఈమెయిల్‌ ఐడీ ద్వారా లాగిన్‌ అయి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు కావలసిన అంశాలను ఎంచుకొని చదువుకోవచ్చు లేదా డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

Chinese Apps: భారత్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న చైనా యాప్స్‌.. మూలాలు తెలియకుండా జాగ్రత్త..!

బాదుడే.. బాదుడు.. క్రెడిట్‌ కార్డుదారులకు ఆ బ్యాంకు షాకింగ్‌ న్యూస్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి కొత్త నిబంధనలు.!

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ