Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wipro Jobs: బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విప్రోలో మీ కోసం 30వేల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి.

Wipro Elite National Talent Hunt: మీరు ఇప్పుడు బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారా.? వచ్చే ఏడాది డిగ్రీ పట్టా చేతిలోకి వస్తుందా.? అయితే ఈ వార్త మీ కోసమే...

Wipro Jobs: బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విప్రోలో మీ కోసం 30వేల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి.
Wipro Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 31, 2021 | 12:40 PM

Wipro Elite National Talent Hunt: మీరు ఇప్పుడు బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారా.? వచ్చే ఏడాది డిగ్రీ పట్టా చేతిలోకి వస్తుందా.? అయితే ఈ వార్త మీ కోసమే. ప్రముఖ ఐటీ సంస్థ విప్రో పెద్ద ఎత్తున ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌ చేసుకునే క్రమంలో ‘విప్రో ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఏకంగా 30,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది. 2022లో బీటెక్‌ ఉత్తీర్ణులు కానున్న వారు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని విప్రో సూచించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు https://careers.wipro.com/elite లింక్‌లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. భారీ ఎత్తున ఉద్యోగుల అవసరం ఉండడం, విప్రోలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర కంపెనీల బాట పట్టడంతో విప్రో ఇలా భారీగా ఉద్యోగాల నియామకం చేపట్టిందని విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ తీర్రి డెలపోర్టే తెలిపారు.

ఈ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 23, 2021న ప్రారంభం కాగా.. సెప్టెంబర్‌ 15, 2021తో ముగియనుంది. దరఖాస్తుల చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్‌ 25, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని తీసుకొని శిక్షణ ఇస్తారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 3,50,000 వరకు జీతంగా అందిస్తారు. ఎంపికైన వారు 12 నెలలు సర్వీస్ అగ్రిమెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో మొత్తం మూడు సెక్షన్స్‌ ఉంటాయి. వీటిలో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ (వర్బల్) ఎబిలిటీకి 48 నిమిషాలు ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 నిమిషాలు, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఫీచరింగ్ 60 నిమిషాలు ఉంటుంది. కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్స్‌కు సంబంధించినవి ఉంటాయి.

ఇక ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులు.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైమ్ బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్) చదువుతున్నవారై ఉండాలి. ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ తప్ప ఇతర బ్రాంచ్‌లల్లో కోర్సు చేసుకున్నవారు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక టెన్త్, ఇంటర్‌లో 60 శాతం పైగా మార్కులు ఉండాలి.

Also Read: Digital Library: అరచేతిలో గ్రంథాలయం.. విజ్ఞానాన్ని అందించే డిజిటల్‌ లైబ్రరీ యాప్‌.. 4 కోట్లకుపైగా పుస్తకాలు..

Petrol Bunks Bandh: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఇవాళ 3వేల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.. కారణం ఏమంటే..?

TS Schools Re-Open: తెలంగాణలో స్కూళ్ల రీ-ఓపెన్‌కు తాత్కాలిక బ్రేక్.. హైకోర్టు ఏం చెప్పిందంటే..