DMHO Recruitment 2021: మంచి వేతనంతో మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాలు.. ఇంటర్ అర్హత.. రేపే ఇంటర్వ్యూ.. వివరాల్లోకి వెళ్తే..
DMHO Guntur Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపీ సర్కార్ కు చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం లో..
DMHO Guntur Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఏపీ సర్కార్ కు చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం లో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉద్యోగం వివరాలు:
ఉద్యోగం : పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు : 21
విద్యార్హత : ఎంపీసీ లేదా బైపీసీలో ఇంటర్మీడియట్ చదివిన వారు, బీఎస్సీ, ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ డిప్లొమా ఉత్తీర్ణత అయినవారు ఈ పోస్టులకు అర్హులు
వయసు : 42 సంవత్సరాలు గరిష్ట పరిమితి (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంది)
వేతనం: నెలకు రూ. 15,000/ – 50,000/-
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 01, 2021
ఇంటర్యూ జరిగే ప్రాంతం:
డీఎంహెచ్‌ఓ కార్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
Also Read: Jyothika: హిమాలయాల్లో త్రివర్ణ పతాకంతో జ్యోతిక.. లాక్డౌన్ డైరీలను పంచుకోవడం హ్యాపీ అంటూ ట్వీట్..