- Telugu News Photo Gallery Cinema photos Actress jyotika shares himalayals bikat adventures photos in instagram
Jyothika: హిమాలయాల్లో త్రివర్ణ పతాకంతో జ్యోతిక.. లాక్‌డౌన్ డైరీలను పంచుకోవడం హ్యాపీ అంటూ ట్వీట్..
ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ.. టాప్ హీరోయిన్లో ఒకరిగా కొనసాగారు జ్యోతిక. తెలుగు, తమిళ్ భాషలలో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.
Updated on: Aug 31, 2021 | 2:17 PM

ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీపవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు జ్యోతిక..

ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన జ్యోతిక నిత్యం వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

తాజాగా హిమాలయాల్లో టూర్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది జ్యోతిక. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లిన జ్యోతిక.. త్రివర్ణ పతాకంతో తనలో ఉన్న దేశభక్తిని చాటుకున్నారు.

కశ్మీర్‌లోని సుందర సరస్సుల మధ్య తన టీమ్‌తో దిగిన కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేసింది. బికాత్ అడ్వెంచర్స్ టీమ్‌లోని సభ్యులతో జ్యోతిక హిమాలయ అందాలను తిలకించారు.

హలో ఎవిరివన్ అంటూ తన పోస్టులో పేర్కొన్న జ్యోతిక.. తన లాక్‌డౌన్ డెయిరీల్లోంచి కొన్ని పాజిటివ్ అంశాలను పోస్టు చేస్తున్నట్లు చెప్పింది.

జీవితం వాస్తవికమైనదని, కానీ జీవించడం ప్రారంభించాకే ఆ విషయం తెలుస్తుందన్న ఉద్దేశాన్ని ఆమె తన పోస్టులో పేర్కొన్నది. భారత్ అత్యంత రమణీయంగా ఉన్నట్లు కూడా తన ఇన్‌స్టాలో తెలిపింది జ్యోతిక.

హిమాలయాల్లో త్రివర్ణ పతాకంతో జ్యోతిక..




