Anil kumar poka |
Updated on: Aug 31, 2021 | 6:20 PM
సోషల్ మీడియా వేదికగా గౌతమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. గౌతమ్‌కు మహేష్ బాబు, నమ్రతతోపాటు.. చెల్లెలు సితార కూడా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ చెబుతున్నారు.
ఘట్టమనేని కుటుంబంలోని హీరోలను తెలుగు ప్రేక్షకులను ఎంతగా అభిమానిస్తారో చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ అనంతరం ఆయన తనయుడు మహేష్ బాబు ప్రస్తుతం అగ్రహీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.
ఇక మహేష్ ఫ్యామిలీ నుంచి మరో ప్రిన్స్ టాలీవుడ్ రాబోతున్న సంగతి తెలిసిందే. అతనే.. మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని.
చిన్నప్పటి నుంటి టీనేజర్ వరకు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఫుల్ క్రేజ్ సంపాదించాడు గౌతమ్. అందంలో, ఫాలోయింగ్ క్రేజ్ చూస్తే తాతకు, తండ్రికి ఏమాత్రం తీసిపోడని అనిపిస్తుంటుంది. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను దగ్గరయ్యాడు. ఈరోజు గౌతమ్ 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
హ్యాప్పీ 15 మై సన్.. నువ్వు ఎదగడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. అంటూ ట్వీట్ చేశాడు మహేష్.
సోషల్ మీడియా వేదికగా నమ్రత గౌతమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
గౌతమ్‌కు చెల్లెలు సితార కూడా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ చెబుతున్నారు.
గౌతమ్ 2006లో ఆగస్ట్ 31న జన్మించాడు. ఇక 8 సంవత్సరాల వయసులోనే 1 నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.
ఇక 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన గౌతమ్ తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌లోని టాప్ 8 ఈతగాళ్ళలో స్థానం దక్కించుకున్నాడు.
ఈతలోని నాలుగు విధానాల్లో గౌతమ్ అద్భుతంగా ఈదగలడు. మహేష్ తర్వాత గౌతమ్ కూడా వెండితెర పై స్టార్ హీరోగా ఎప్పుడెప్పుడు వస్తాడా ? అని ప్రిన్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
15వ పుట్టినరోజు జరుపుకుంటున్నా గౌతమ్ కు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు..
గౌతమ్ అందంలో, ఫాలోయింగ్ క్రేజ్ చూస్తే తాతకు, తండ్రికి ఏమాత్రం తీసిపోడని అనిపిస్తుంటుంది.
ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తారు అని తెలిసిందే .