CAT – 2021: అక్టోబర్‌లో అడ్మిట్ కార్డ్.. నవంబర్‌లో పరీక్ష.. క్యాట్ పరీక్ష పూర్తి షెడ్యూల్ వివరాలివే..
CAT - 2021: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ద్వారా సాధారణ ప్రవేశ పరీక్ష కోసం షెడ్యూల్ విడుదల చేయబడింది. ఈ నేపథ్యంలో క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే..
CAT – 2021: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ద్వారా సాధారణ ప్రవేశ పరీక్ష కోసం షెడ్యూల్ విడుదల చేయబడింది. ఈ నేపథ్యంలో క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- iimcat.ac.in ని సందర్శించి దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను (CAT 2021) చూడవచ్చు.
దేశంలోని టాప్ మేనేజ్‌మెంట్ కాలేజీలలో ప్రవేశానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4, 2021 నుండి ప్రారంభమైంది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 15 సెప్టెంబర్, 2021 వరకు సమయం ఇచ్చారు. ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డ్ 27 అక్టోబర్, 2021 న జారీ చేయబడుతుందని, పరీక్ష (CAT 2021) 28 నవంబర్, 2021 న నిర్వహించబడుతుందని అధికారులు ప్రకటించారు. ఇక దీని ఫలితాలను జనవరి 2022లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
CAT – 2021 పూర్తి వివరాలు.. కనీసం 50% మార్కులు లేదా సమానమైన CGPA తో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు CAT 2021 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకు అర్హత పరీక్షలో కనీస మార్కులు 45 శాతం ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత పరీక్ష చివరి సంవత్సరానికి హాజరయ్యే అభ్యర్థులు, డిగ్రీ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మూడు సెషన్లలో జరుగుతుంది.
తుది ఎంపిక.. క్యాట్ స్కోర్ తర్వాత, విద్యార్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. కరోనా కారణంగా గత సంవత్సరం చాలా వరకు ఐఐఎంలు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను నిర్వహించాయి. గ్రూప్ డిస్కర్షన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించే అంశంపై పూర్తి హక్కులు ఐఐఎంలైనే ఉంటుంది. ఆర్గనైజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాట్ ఇందులో జోక్యం చేసుకోదు.
పరీక్ష కోసం 400 కేంద్రాలు.. ఈ సంవత్సరం CAT పరీక్షను 158 నగరాల్లోని 400 కేంద్రాలలో నిర్వహించనున్నారు. విద్యార్థులు ఆరు నగరాల్లో ఏదైనా కేంద్రాలను ఎంచుకోవచ్చు. అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రం దరఖాస్తు ఫారంలో నింపిన వారి ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం సగటున రెండు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు, దీని ఆధారంగా ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఐఐఎంలలో ప్రవేశం పొందుతారు.
Also read:
తాతల మజాకా… ఇప్పుడే ఇలా ఉన్నారంటే?మరి అప్పట్లో..వైరల్ అవుతున్న వీడియో:Grand fathers Video.