Covid 19 Vaccine: వ్యాక్సినేషన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ఒక్క రోజులో కోటీ 30 లక్షలకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ..
Corona Vaccine: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ చేసి ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన..
Corona Vaccine: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ చేసి ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతేకాదు.. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం 65 కోట్ల కీలక మైలురాయిని దాటింది. అంతకు ముందు రోజు 59,62,286 మందికి టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.
కరోనా వైరస్ కట్టడికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ వేశారు. రాత్రి గం. 11.28 వరకు 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. అదే సమయంలో ఇప్పటి వరకు 50 కోట్ల మందికి వ్యాక్సిన్ మొదటి డోస్ వేశారు.
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ‘దేశం సరికొత్త రికార్డ్ సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 1.30 లక్షల టీకాలు వేసి మునుపటి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. కోటికి పైగా టీకా వేస్తుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.’’ అని పేర్కొన్నారు.
కోవిడ్ వారియర్స్‌ని ప్రశంసించిన ఆరోగ్య మంత్రి.. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మరో మైలురాయి దాటింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ 50 కోట్ల మంది అందుకున్నారు. కోవిడ్ వారియర్స్ కృషిని, ఈ గొప్ప విజయాన్ని సాధించడంలో వారికి సహాయపడిన వారందరికీ నా అభినందనలు.’’ అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ట్వీట్ చేశారు.
దేశంలో కరోనా వైరస్.. భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 30,941 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,27,68,880 కి పెరిగింది. అదే సమయంలో, పాజిటివ్ కేసు సంఖ్య 3,70,640 కి తగ్గింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఈ కరోనా వైరస్ కారణంగా 350 మంది మరణించారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 4,38,560 లకు పెరిగింది. దేశంలో పాజిటీవ్ రేటు 1.13 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.53 శాతం. దేశంలో ఇప్పటివరకు మొత్తం 52,15,41,098 సాంపిల్స్ సేకరించగా.. అందులో సోమవారం నాడు 13,94,573 నమూనాలను పరీక్షించారు. రోజువారీ పాజిటివ్ రేటు 2.22 శాతంగా ఉంది. అదే సమయంలో, వీక్లీ పాజిటివ్ రేటు 2.51 శాతంగా ఉంది. ఇది గత 67 రోజులలో మూడు శాతం కంటే తక్కువ. కోవిడ్ -19 మరణాల రేటు 1.34 శాతం. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,19,59,680 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Also read:
తాతల మజాకా… ఇప్పుడే ఇలా ఉన్నారంటే?మరి అప్పట్లో..వైరల్ అవుతున్న వీడియో:Grand fathers Video.