Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో గుట్టుగా వ్యభిచారం.. అది తెలిసిన పోలీసులు ఏం చేశారంటే..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు అయినవిల్లి పోలీసులు. ఈ వ్యవహారంలో ఇద్దరు యువతులు

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో గుట్టుగా వ్యభిచారం.. అది తెలిసిన పోలీసులు ఏం చేశారంటే..
Prostitution
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 01, 2021 | 6:03 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు అయినవిల్లి పోలీసులు. ఈ వ్యవహారంలో ఇద్దరు యువతులు సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యభిచారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోన అయినవిల్లిలో ఓ ముఠా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. తొత్తరమూడి జైభీమ్ నగర్‌లోని ఓ ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ కలిసి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

అయితే, ఇద్దరు యువతులను ఇంట్లోనే ఉంచి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. వ్యభిచారంపై సమాచారం అందుకున్న అయినవిల్లి పోలీసులు.. పక్కా పథకం ప్రకారం అదును చూసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు యువతులు, ఒక విటుడితో పాటు.. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న భార్యా, భర్తలను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తుచేస్తున్నారు.

Also read:

Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.. నిండుకుండలా రిజర్వాయర్లు, చెరువులు..

Assam Floods: అస్సాంను ముంచెత్తుతున్న వరదలు.. తినడానికి తిండి కూడా లేక జనం ఆర్తనాదాలు..

Capricorn: మకర రాశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియన ఆసక్తికరమైన విషయాలు.. మీకోసం..