Assam Floods: అస్సాంను ముంచెత్తుతున్న వరదలు.. తినడానికి తిండి కూడా లేక జనం ఆర్తనాదాలు..
Assam Floods: దాచుకున్న బియ్యం నీట మునిగాయి, తెచ్చుకున్న సరుకులు పాడయ్యాయి.. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అసోం జనం ఆర్తనాదాలు చేస్తున్నారు.
Assam Floods: దాచుకున్న బియ్యం నీట మునిగాయి, తెచ్చుకున్న సరుకులు పాడయ్యాయి.. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అసోం జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. భారీ వర్షాలకు అసోం అతలాకుతలం అవుతోంది. అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు పోటెత్తాయి. 21 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. 3 లక్షల 63 వేల మంది వరదల బారిన పడ్డారు. బార్ పేట, మోరిగావ్ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు వరదనీటిలో కొట్టుకుపోయారు. బార్‌పేట, బిశ్వనాథ్, కచార్, చిరాంగ్, దరాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రుగర్, గోలాఘాట్, జోర్హాట్, కమ్రూప్, కర్బీ ఆంగ్‌లాంగ్ వెస్ట్, లఖింపూర్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బారి, ఎస్ , సోనిత్పూర్, దక్షిణ సల్మారా, టిన్సుకియా జిల్లాల్లో వేలాది మంది వరదల వల్ల అవస్థలు పడుతున్నారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకటించింది.
కేవలం లఖింపూర్ జిల్లాలోనే లక్షా 30 వేల మంది ఈ వరదల వల్ల ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర నదితోపాటు దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో 30 వేల హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. 21 జిల్లాల్లోని 950 గ్రామాలు నీట మునగడంతో ప్రజల సాధారణ జీవనానికి తీవ్ర ఆటంకం కలిగింది. నదులు ప్రమాదకరస్థాయి కంటే మించి ప్రవహిస్తున్నాయి. వరదనీటి ధాటికి బార్ పేట, దరాంగ్, గోలాఘాట్, చమోరిగావ్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు నానాతంటాలు పడాల్సి వచ్చింది. అటు మహారాష్ట్రలోను పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఔరంగాబాద్‌లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also read:
Capricorn: మకర రాశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియన ఆసక్తికరమైన విషయాలు.. మీకోసం..