Viral Video: విమానం దిగిన ప్రయాణీకులు లగేజీ తీసుకోవడానికి వెళ్లి అవాక్కయ్యారు.. కన్వేయర్ బెల్ట్ మీద ఏం కనిపించిందంటే..

విమానంలో మనుషులు వెళ్ళడం మామూలే. వారితో పాటూ సూట్ కేస్ లు.. బ్యాగులు.. ఇతర లగేజీ వెళ్ళడమూ సాధారణమే.

Viral Video: విమానం దిగిన ప్రయాణీకులు లగేజీ తీసుకోవడానికి వెళ్లి అవాక్కయ్యారు.. కన్వేయర్ బెల్ట్ మీద ఏం కనిపించిందంటే..
Viral Video
Follow us
KVD Varma

|

Updated on: Sep 01, 2021 | 9:10 PM

Viral Video: విమానంలో మనుషులు వెళ్ళడం మామూలే. వారితో పాటూ సూట్ కేస్ లు.. బ్యాగులు.. ఇతర లగేజీ వెళ్ళడమూ సాధారణమే. ఇదంతా మాకు తెలుసు మీరెందుకు చెబుతున్నారు అంటారా? ఆ విషయానికే వస్తున్నాం.. విమానంతో పాటూ వచ్చిన లగేజీలో కోడిమాంసం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది అమెరికాలో. విమానం దిగిన ప్రయాణీకులు లగేజీ తీసుకునే కన్వేయర్ బెల్ట్ పై హఠాత్తుగా చికెన్ లెగ్ పీస్ లు.. చికెన్ చెస్ట్ పీసులతో కూడిన బ్యాగ్ వచ్చింది. అది కూడా ఓపెన్ గా. దీంతో అక్కడ ఉన్న ప్రయాణీకులు విస్తుపోయారు.

వాషింగ్టన్‌లోని సీటెల్ నుంచి ఈ సంఘటన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) పోస్ట్ చేసింది. ఒక కంటైనర్ లో ఉన్న ముడి చికెన్ క్యూబ్ ఆకారంలో ఉంది. ఇది కంటైనర్ లో ఉన్నది అయివుందవచ్చని అధికారులు భావిస్తున్నారు. అది అసలు ఆ కన్వేయర్ బెల్ట్ పైకి ఎలా వచ్చింది అనేది తేలలేదు. ప్రయాణీకులతో పాటు విమానంలోకి వెళ్ళే ప్రతి బ్యాగ్ తనిఖీ చేస్తారు ఆ పరిస్థితిలో విమానం నుంచి వచ్చిన ప్రయాణీకుల ద్వారా ఇది వచ్చి ఉండదని అధికారులు అంటున్నారు. ఇది ఆకతాయిలు కావాలని చేసిన పని అయివుండవచ్చని.. విమానాశ్రయంలో కన్వేయర్ బెల్ట్ పై కావాలని ఇది వుంచి ఉంటారనీ వారు అంటున్నారు.

ఈ చికెన్ అక్కడకు ఎలా వచ్చింది? దానికి కారణాలేమిటి అనే విషయాలను ఆరాతీయడంలో బిజీ అయిపోయారు విమానాశ్రయ అధికారులు. ఇక అక్కడి ప్రయాణీకులు ఈ దృశ్యాన్ని చూసి నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.

ఆ వీడియో మీరూ చూసేయండి..

 

Also Read:  Brazilian Viper Venom: ప్రాణాలు తీసే పాము విషంతోనే కరోనాకు మందు.. ప్రయోగాల ద్వారా తేల్చిన పరిశోధకులు

Soldiers Nicole Gee: చిన్నారిని లాలించిన సైనికురాలు ఇక లేరు.. కాబూల్‌ బాంబు పేలుళ్లలో గాయపడి దుర్మరణం