AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income tax: ఆదాయపు పన్ను నోటీసులు రాకుండా ఎన్ని పొదుపు ఖాతాలను రన్ చేయొచ్చు?.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Income tax: ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోకుండా.. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్‌ని మెయింటేన్ చేయొచ్చు?. ఇది చాలా మందిలో సహజంగానే..

Income tax: ఆదాయపు పన్ను నోటీసులు రాకుండా ఎన్ని పొదుపు ఖాతాలను రన్ చేయొచ్చు?.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Income Tax
Shiva Prajapati
|

Updated on: Sep 02, 2021 | 6:38 AM

Share

Income tax: ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోకుండా.. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్‌ని మెయింటేన్ చేయొచ్చు?. ఇది చాలా మందిలో సహజంగానే ఉత్పన్నమయ్యే ప్రశ్న. ప్రజలు ఒకేసారి ఎన్ని పొదుపు ఖాతాలను రన్ చేయవచ్చో తెలుసుకోవాలనుకుంటారు. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం ద్వారా.. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఇక, ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందుకోకుండా పొదుపు ఖాతాలో ఉంచగల గరిష్ట బ్యాలెన్స్ ఎంత? ఇది రెండో ప్రశ్న. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల మనస్సులో ఇటువంటి అనేక ప్రశ్నలు వస్తుంటాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం..

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చాలా సులభం. బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖలో ఎలాంటి ప్రత్యేక నియమ, నిబంధనలు లేవు. ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్ని పొదుపు ఖాతాలను అయినా కలిగి ఉండొచ్చు. అంటే, ఆదాయ పన్ను శాఖకు పొదుపు ఖాతాలతో ఎలాంటి సంబంధం లేదు. మీకు కావలసినన్ని ఖాతాలను మెయింటేన్ చేయొచ్చు. ఇక ఖాతాల్లో ఉంచాల్సిన గరిష్ట మొత్తానికి కూడా పరిమితి లేదు. ఇది ఆదాయపు పన్నుతో ముడిపడి ఉంటుంది. మీకు కావలసినంత డబ్బును మీరు ఉంచుకోవచ్చు. అయితే, లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు వర్తిస్తాయి. అంటే, మీరు పొదుపు ఖాతా నుండి ఎంత డబ్బు, ఏ విధంగా ఖర్చు చేస్తారు, మీరు దానిని నగదు రూపంలో చేసినా, క్రెడిట్-డెబిట్ కార్డు ద్వారా చేసినా, ఈ విషయాలు జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది.

నగదు లావాదేవీలపై శ్రద్ధ వహించండి.. మీరు ఆదాయపు పన్ను నోటీసును అందుకోకుండా ఉండాలంటే.. మీ నగదు లావాదేవీలపై జాగ్రత్త వహించాలి. దీనిపై దృష్టి పెడితే, మీరు ఆదాయపు పన్ను శాఖ తీసుకునే చర్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక సంవత్సరంలో మీరు రూ. 10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. రూ. 10 లక్షలకు మించి విత్‌డ్రా చేయడం, ఆ పొదుపు ఖాతాలో రూ. 10 లక్షలకు మించి జమ చేయడం జరిగితే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే.. ఒకే లావాదేవీ రూ. 2 లక్షలకు మించకూడదు.

ఎంత డబ్బు విత్‌డ్రా చేయొచ్చు.. డిపాజిట్ చేయొచ్చు.. మరో ప్రధాన ప్రశ్న ఏంటంటే.. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా ఒకేసారి రూ. 2 లక్షలకు పైగా లావాదేవీ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ దానికి సంబంధించిన సమాచారాన్ని ఎలా గ్రహిస్తుంది?. దీనికి ఆన్సర్ చాలా ఈజీ.. మీ పాన్ కార్డు బ్యాంక్ ఖాతాలు లింక్ చేసి ఉంటుంది. తద్వారా మీరు మీ పొదుపు ఖాతా నుండి రూ. 10 లక్షలకు పైగా విత్‌డ్రా లేదా డిపాజిట్ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ ‘పాన్’ ద్వారా దానికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందుతుంది.

ఒకవేళ ‘పాన్’ లింక్ చేయకపోతే.. మీరు రూ. 10 లక్షలకు పైగా డిపాజిట్ లేదా విత్‌డ్రా చేస్తే సదరు బ్యాంక్ ఆదాయపు పన్ను విభాగానికి తెలియజేస్తుంది. సహకార బ్యాంకు, పోస్టాఫీసు సేవింగ్స్ కూడా పన్ను విభాగానికి సమాచారం అందించొచ్చు. సహకార బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా డబ్బు జమ చేయవచ్చు లేదా విత్‌డ్రా చేయవచ్చు. ఈ కారణంగా సహకార బ్యాంకు, పోస్టాఫీసులు కూడా లావాదేవీలకు సంబంధించి సమాచారం ఇచ్చే హక్కును కలిగి ఉంటాయి.

కరెంట్ ఖాతా నియమం.. ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక వ్యక్తి బ్యాంక్ డ్రాఫ్ట్‌లు కొనడానికి లేదా పే ఆర్డర్‌లు తీసుకోవడానికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదును ఖర్చు చేస్తే, అతనికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు వెళ్లే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ హోదాను పొందిన ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేసినందుకు కూడా చర్యలు తీసుకోవచ్చు. కరెంట్ ఖాతాకు కూడా ఇదే నియమం ఉంది. కానీ లావాదేవీ పరిమితి రూ. 50 లక్షలుగా పేర్కొన్నారు. కరెంట్ ఖాతాలో సంవత్సరానికి రూ. 50 లక్షలకు మించి జమ చేయలేరు. రూ. 50 లక్షలకు మించి విత్‌డ్రా చేయలేరు. చెక్ ద్వారా కూడా అంతే పరిస్థితి ఉంటుంది.

Also read:

Viral Fever: ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు.. వింత వ్యాధితో 70 మంది చిన్నారుల మృత్యువాత..

Amazon: అమెజాన్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు.. కీలక ప్రకటన చేసిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జాస్సీ..

Gold Price Today: ప్రసిడి ప్రియులకు బ్యాడ్‏న్యూస్.. స్థిరంగా గోల్డ్ రేట్స్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..