Vizag Footpaths: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫుట్ పాత్ లపై చేపలను అమ్మడం పై నిషేధం విధించారు జీవీఎంసీ అధికారులు. దీంతో ఇక నుంచి వైజాగ్ ఫుట్‌పాత్‌లలో చేపల అమ్మకం సాధ్యం కాదు. అధికారుల నిషేధాజ్ఞలను ఎవరైనా ఉల్లంగించి చేపల అమ్మకం ఫుట్ పాత్ లపై అమ్మడం మొదలు పెడితే.. అటువంటి వారికి జరిమానా విధించడంతోపాటు.. అలా ఫుట్‌పాత్‌లపై చేపలను అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు.. చేపల విక్రేతలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే వార్డ్ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
నగరంలో ఫుట్ పాత్ లపై చేపల అమ్మకం భారీగా సాగుతుంది. దాదాపు 600 కి పైగా అమ్మకందారుల ఇలా ఫుట్ పాత్ లపై వ్యాపారలావాదేవీలు కొనసాగిస్తున్నారని జీవీఎంసీ వెటర్నరీ ఆఫీసర్ ఎన్ కిషోర్ చెప్పారు. విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ బంగ్లా ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై కూడా చేపలను అమ్ముతున్నారని చెప్పారు.
జీవీఎంసీ కమీషనర్ సృజన ఎంవిపి కాలనీని సందర్శిస్తున్న సమయంలో అక్కడ ఫుట్‌పాత్‌లపై చేపలను అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ స్థలం పాదచారుల కోసం ఉద్దేశించబడింది.. కనుక చేపల విక్రేతలకు ఫుట్‌పాత్‌లను ఉచితంగా అందించాలని ఆమె శానిటరీ ఇన్‌స్పెక్టర్లను కోరారు.
ఈ సందర్భంగా మత్స్య కార్మికుల నాయకుడు అర్జిలి దాస్ మాట్లాడుతూ.. నగరంలో చేపల అమ్మకానికి 32 మార్కెట్లు ఉన్నాయి. అయితే మత్స్యకారులు, చేపల విక్రేతల కోసం ప్రభుత్వం మరిన్ని హాకర్ జోన్‌లను ప్రవేశపెట్టాలని .. అప్పుడు వీధుల్లో, పబ్లిక్ రోడ్లలో చేపలను విక్రయించే పద్ధతిని నిలిపివేయవచ్చని చెప్పారు. నగరంలోని చైనా వాల్‌టెయిర్, అప్పుఘర్, రామలక్ష్మి అపార్ట్‌మెంట్స్ జంక్షన్, BRTS రోడ్, విశాలాక్షి నగర్, సీతమ్మధార, MVP కాలనీ, మురళీ నగర్, గాజువాక, KRM కాలనీ, HB కాలనీ, సింహాచలం, వేపగుంటలో ఫుట్ పాత్ లపై చేపల అమ్మకం సర్వసాధారణంగా కనిపిస్తుంది.