Pawan Kalyan: బర్త్ డే వేళ పవన్‌కు వెళ్లువెత్తుతోన్న ప్రముఖుల శుభాకాంక్షలు.. గవర్నర్ ప్రత్యేక సందేశం
తన విలక్షణ విధానంతో అటు, తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, తెలుగు పాలిటిక్స్ లోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక క్రేజ్ సృష్టించుకున్నారు.
Birthday wishes to pawan: తన విలక్షణ విధానంతో అటు, తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, తెలుగు పాలిటిక్స్ లోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక క్రేజ్ సృష్టించుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పవన్ అభిమానులే. తన స్టైల్, ఆటిట్యూడ్ అంటే ఆయన అభిమానులేకాదు, పొలిటికల్ లీడర్లు కూడా ఇష్టపడతారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఇప్పటికే అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో మొత్తం పవన్ మేనియా కొనసాగుతుంది.
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ సహా అటు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పవర్ స్టార్‌కు విషెష్ వెల్లువెత్తుతున్నాయి. “శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని తెలంగాణ గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు.
Birthday greetings to Shri @PawanKalyan garu Wish you happy & healthy future years ahead to serve the nation.
శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.???
(File Photo) pic.twitter.com/Cv8FJCZY83
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 2, 2021
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు తన శుభాకాంక్షలు, శుభాభినందనలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక రెండు వరుస ట్వీట్లలో తన మనసులోని మాట బయటపెట్టారు. “నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ, పుష్కర కాలంగా అనేక పోరాటాలు సాగిస్తూ, గెలుపైనా, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం, ప్రజలలోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో భరతమాత సేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని సోము పేర్కొన్నారు.
నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ, పుష్కర కాలంగా అనేక పోరాటాలు సాగిస్తూ, గెలుపైనా, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం, ప్రజలలోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జన నేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. (1/2)@JanaSenaParty pic.twitter.com/q2Neh1A6yR
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 2, 2021
అటు, ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ పవన్ గురించి చేసిన పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశంలో.. “అతనే సైనికుడు, అతనే సైన్యాధిపతి, చిరునవ్వుతో దమ్ము చూపించగలవాడు, పట్టువదలని విక్రమార్కుడు, జనంకోసం అనుక్షణం తపించే పవణ్ కళ్యాణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నట, రాజకీయ వైభవ ప్రాప్తిరస్తు. శతమానం భవంతు” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
అతనే సైనికుడు ,అతనే సైన్యాధిపతి ,చిరునవ్వుతో దమ్ము చూపించగలవాడు ,పట్టువదలని విక్రమార్కుడు ,జనంకోసం అనుక్షణం తపించే పవణ్ కళ్యాణ్ కి @PawanKalyan జన్మ దినశుభాకాంక్షలు? నట ,రాజకీయ వైభవ ప్రాప్తిరస్తు? శతమానం భవంతు ?️#HBDPawalaKalyan pic.twitter.com/X06EnqqwAl
— Paruchuri GK (@GkParuchuri) September 2, 2021