Warangal Murders: వరంగల్ సామూహిక హత్యల కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు..!

వరంగల్‌లో సామూహిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Warangal Murders: వరంగల్ సామూహిక హత్యల కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు..!
Arrested
Balaraju Goud

|

Sep 02, 2021 | 11:21 AM

Warangal Murders Case: వరంగల్‌లో సామూహిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కత్తులు, తల్వార్‌లు, ఎలక్ట్రిక్ రంపం మిషన్లతో నిందితులు ఎటాక్ చేసినట్టు గుర్తించారు. హత్యోదంతంలో మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నాడు తెల్లవారుజామున సోదరుడి కుటుంబంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో షఫీ సహా అతనికి మరో ఐదుగురు సహకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఎల్బీనగర్‌లో పగ ప్రతీకారంతో రగిలిపోయి, అత్యంత భయంకరంగా హత్యలు చేశారు. వాళ్ల క్రూయల్ మెంటాల్టీకి ఇల్లు ఇళ్లంతా రక్తంతో నిండిపోయింది. కత్తి వేటుకి.. రంపం కోతకి చాంద్‌ పాషా, ఖలీల్‌, సబీరాలు బలయ్యారు. సమర్‌, ఫహద్‌లు గాయాలతో బతికి బయటపడ్డారు. ఈ దుర్మర్గానికి తెగబడింది చాంద్‌ పాషా తమ్ముడు షఫి అని తేల్చారు పోలీసులు. చాంద్ పాషా, అతని కొడుకులు, సోదరుడు షఫీ పశువుల వ్యాపారం చేస్తుంటారు. ఆవులు, గొర్రెలు, మేకల మాంసాన్ని మటన్ షాప్‌లకు అమ్ముతుంటారు. ఈ క్రమంలోనే అన్నదమ్ములు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. అవికాస్త చినికి చినికి గాలివానగా మారి నట్టింట్లో నరమేధానికి దారితీశాయి. వ్యాపారంలో విబేధాల కారణంగానే సోదరుడి కుటుంబంపై షఫీ దాడి చేశాడు.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్‌. స్వయానా తమ్ముడే క్యాష్ విషయంలో క్లాషెస్ రావడంతో ఉన్మాదంతో రగిలిపోయాడు. నా అనుకున్న వాళ్లను దారుణంగా నరికి చంపేశాడు. నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు షఫీతో పాటు ఎంతమంది ఈ హత్యల్లో పాల్గొన్నారు..నర్సంపేటకు చెందిన గొర్రెల కాపరి వెంకన్న, రూపిరెడ్డిపల్లెకు చెందిన విజేందర్, లారీ డ్రైవర్ ఎండీ పాషా, ఉర్సుగుట్టకు చెందిన మీర్జా ఇక్బాల్, సాధిక్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. షఫీ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరికొద్ది సేపట్లో మీడియా ముందు నిందితులను హాజరు పర్చనున్న వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

Read Also…  Twin Elephants: ఆ దేశంలో 80 ఏళ్ల తర్వాత కవల ఏనుగులు జననం… తల్లితో సంతోషంగా ఆడుకుంటున్న గున్న ఏనుగులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu