TS EAMCET 2021: విద్యార్థులకు కీలక సూచన.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మార్పులు..

తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఉన్నత విద్యా మండలి. గతంలో విడుదల చేసిన కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియ వాయిదా పడింది.

TS EAMCET 2021: విద్యార్థులకు కీలక సూచన.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మార్పులు..
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 02, 2021 | 12:22 PM

Engineering Counselling schedule 2021: తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఉన్నత విద్యా మండలి. గతంలో విడుదల చేసిన కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియ వాయిదా పడింది. ఎంసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నెల 11 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. అయితే ఈనెల 18న ఇంజినీరింగ్‌ మొదటి విడత సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4 నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలై 13తో ముగియాల్సి ఉంది. మరోవైపు, ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్‌ యథాతథంగా జరగనుంది. ఈ నెల 4నుంచి 11వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. కళాశాలల గుర్తింపు ప్రక్రియ జాప్యంతో షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ ఏడాది విడుదల చేసిన ఎంసెట్‌ ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 82 శాతం మంది, అగ్రికల్చర్‌లో 92 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు లక్షా 47 వేల 991 మంది హాజరైతే లక్షా 21 వేల 480 మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌లో 79 వేల 900 మంది పరీక్ష రాస్తే 73 వేల 070 మంది అర్హత సాధించినట్లు ప్రకటించారు మంత్రి సబిత. ఇంజనీరింగ్‌లో టాప్‌ 5లో ఐదుగురు అబ్బాయిలే వచ్చారు. అగ్రికల్చర్‌లో టాప్‌ సెకండ్‌ ర్యాంక్‌ను ఈమని శ్రీనిజ సాధించింది. కరోనా సమయంలోనూ ఇబ్బందులు రాకుండా పరీక్షలు నిర్వహించారు. అడ్మిషన్ల కోసం గత నెల 30వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్‌ 15 నుంచి మొదటి విడత సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది.

Read Also…  Teacher-Delivery Boy: ఒకప్పుడు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసిన టీచర్.. నేడు బ్రతుకు పోరాటంలో డెలివరీ బాయ్‌గా..