Huzurabad Elections: హరీష్ రావు‌పై సంచలన ఆరోపణలు చేసిన ఈటెల.. బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్..

Surya Kala

Surya Kala |

Updated on: Sep 02, 2021 | 1:19 PM

Huzurabad Elections: ఈటెల రాజీనామాతో జరగనున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఎంతో ఉత్కంఠ రేపుతోంది. ఈనెలలో ఎన్నికలు జరగనున్నాయనే నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో..

Huzurabad Elections: హరీష్ రావు‌పై సంచలన ఆరోపణలు చేసిన ఈటెల.. బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్..
Etela Vs Harish

Follow us on

Huzurabad Elections: ఈటెల రాజీనామాతో జరగనున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఎంతో ఉత్కంఠ రేపుతోంది. ఈనెలలో ఎన్నికలు జరగనున్నాయనే నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో పాటు సామాన్యుడి దృష్టి హుజూరాబాద్‌ వైపుకు మళ్లింది. టీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా హుజూరాబాద్ లోని మధువని గార్డెన్ లో బీజేపీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలకో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బొడిగ శోభ, ఎండల లక్ష్మీ నారాయణ, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మంత్రి హరీష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి.. అబద్దాల కారు కూతలు కూస్తున్నారన్నారు. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

హరీష్ రావు ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఉంటుందని.. ఆది ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని మంత్రి హరీష్ రావుని ఈటెల హెచ్చరించారు. అంతేకాదు.. హరీష్ రావుకు ఈటెల సవాల్ విసిరారు… తెలంగాణాలో అభివృద్ది జరగలేదు, డబుల్ బెడ్ రూమ్ కట్టలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు కుంకుమ భరిణలు పంపించి ఓట్లు అడిగేస్తాయికి దిగజారారంటూ కామెంట్స్ చేశారు. వీటన్నిటి మీద హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు సిద్దమా అంటూ మంత్రి హరీష్ రావు కు ఈటెల రాజేంద్ర సవాల్ విసిరారు. అంతేకాదు.. బహిరంగ సభకు ఏర్పాట్లు తాను చేస్తానని.. నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ వి కదా బహిరంగ చర్చకు సిద్దామా అంటూ హరీష్ రావుకు ఈటెల సవాల్ విసిరారు.. మరి ఈటెల సవాల్ పై.. బహిరంగ చర్చపై మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Also Read:  ఒకప్పుడు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసిన టీచర్.. నేడు బ్రతుకు పోరాటంలో డెలివరీ బాయ్‌గా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu