AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSSDC Job Mela : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 200 ఉద్యోగాల నియామకం .. అర్హులెవరంటే..!

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. వరసగా జాబ్ మేళాను నిర్వహిస్తున్న APSSDC మరో ప్రకటన రిలీజ్ చేసింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. HBL Industries లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు..

APSSDC Job Mela : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 200 ఉద్యోగాల నియామకం .. అర్హులెవరంటే..!
Surya Kala
|

Updated on: Feb 27, 2021 | 4:18 PM

Share

APSSDC Job Mela : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. వరసగా జాబ్ మేళాను నిర్వహిస్తున్న APSSDC మరో ప్రకటన రిలీజ్ చేసింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. HBL Industries లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన రిలీజ్ చేశారు. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు మర్చి 5 తేదీ ఉదయం 9 గంటలకు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంది.  తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోని మిరియం డిగ్రీ కాలేజీ లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

అర్హులైన ఆసక్తి గలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఈ పోస్టులకు కేవలం పురుషుల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటిఐ (ఫిట్టర్, డీజిల్, మెకానిక్) డిప్లమా, బీటెక్ (మెకానికల్, ఎలక్రికల్ ) విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. టెక్నీకల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ. 12వేలతో పాటు పీఎస్, ఈఎస్ఐ ఆహారం, వసతి సదుపాయాలను కల్పించనున్నారు. విజయనగరంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఆసక్తిగల అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి. ఇక JAM Session, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ కి హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, జిరాక్స్ లతోపాటు స్టడీ సర్టిఫికెట్స్ ను కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.

తమ సందేహాల నివృత్తి కోసం 9000831156, 7386706272 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Also Read:

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. 21 మందిని బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్ ఉత్తర్వులు

ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త