తెలంగాణ ఎడ్‌సెట్‌ ఎంట్రెన్స్ టెస్ట్‌లో మార్పులు.. ఎడ్‌సెట్‌ కమిటీ ఆమోదం.. ఆగస్టు నెలలో ప్రవేశపరీక్ష..!

తెలంగాణ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష విధానం మార్పులు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్ష ప్రశ్నపత్ర సిస్టమ్‌కు గ్రీన్‌‌సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఎంట్రెన్స్ టెస్ట్‌లో మార్పులు.. ఎడ్‌సెట్‌ కమిటీ ఆమోదం..  ఆగస్టు నెలలో ప్రవేశపరీక్ష..!
Follow us

|

Updated on: Feb 28, 2021 | 6:49 AM

EDCET question paper : తెలంగాణ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష విధానం మార్పులు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్ష ప్రశ్నపత్ర సిస్టమ్‌కు గ్రీన్‌‌సిగ్నల్ ఇచ్చింది. కంప్యూటర్‌ విద్యకు సంబంధించిన అంశాలను చేరుస్తూ టెస్ట్‌ కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎడ్‌సెట్‌ కమిటీ నిర్ణయం మేరకు మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో వర్చువల్‌ విధానంలో సమావేశం జరిగింది. ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, ఓయూ రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 అంశాలపై చర్చించారు. అలాగే ఈ ఏడాది నిర్వహించబోయే వ‌ృత్తి, సాంకేతిక విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

ప్రస్తుతం ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ప్రకారం సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్‌.. ఇలా దేంట్లోనైనా చేరొచ్చు. ఎడ్‌సెట్‌లో మాత్రం ఏ మెథడాలజీ అన్నది నిర్ణయించుకొని పరీక్ష రాయాల్సి వస్తోంది. కానీ, ఇకపై విద్యార్థులకు ఛాయిస్‌ పెరుగుతుంది. అందరికీ ఒకటే పరీక్ష అయినందున బీఎస్‌సీ గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం చదివిన విద్యార్థి బీఈడీలో గణితం లేదా భౌతికశాస్త్రం మెథడాలజీని ఎంచుకోవచ్చు. బీజడ్‌సీ అభ్యర్థులు జీవశాస్త్రంతో పాటు భౌతికశాస్త్రం తీసుకోవచ్చు. బీఏ ఆంగ్లం విద్యార్థల పరీక్ష కోసం గణితం, సైన్స్‌, సోషల్‌ చదవాల్సి ఉన్నా 10వ తరగతిలోపు సిలబస్‌లోనివే ప్రశ్నలు ఇస్తారు. దీంతో అభ్యర్థులకు ఊరట కలుగుతుంది.

అయితే, మొత్తం 150 మార్కులకుగాను 10వ తరగతి సిలబస్‌ నుంచి గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం నుంచి 20 చొప్పున మొత్తం 60 మార్కులు, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 20, ఆంగ్లం 20, జనరల్‌ నాలెడ్జ్‌, ఎడ్యుకేషనల్‌ ఇష్యూకు 30, కంప్యూటర్‌ అవగాహనకు 20 మార్కులు ఉంటాయి. ఇదిలావుంటే, వచ్చే నెల 28న ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, మే 5 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహిస్తామని ఇందుకు సంబంధించి తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

ఇదీ చదవండిః Benefits of Roses : గులాబి పూలు అందం కోసం మాత్రమే కాదు.. తినడానికి కూడా .. వీటి వల్ల ఆడవారికంటే.. మగవారికే ఎక్కువ లాభాలు తెలుసా..