ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. 21 మందిని బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల నేపథ్యంలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 21 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ..

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. 21 మందిని బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్ ఉత్తర్వులు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 27, 2021 | 3:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల నేపథ్యంలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 21 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ దేవాలయాల్లో ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. సింహాచలం దేవస్థానం ఈవోగా ఎంవీ సూర్యకళను ప్రభుత్వం నియమించింది. ద్వారకా తిరుమల దేవస్థానం ఈవోగా జీవీ సుబ్బారెడ్డి, నెల్లూరు జేసీగా బాపిరెడ్డి, ప్రకాశం జేసీగా కె.కృష్ణవేణి, ఏపీ ఎన్నార్టీ సొపైటీ సీఈవోగా కె. దినేష్ కుమార్ ను మచిలిపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా కె. ఆదయ్యను నియమించింది.

శాఖల వారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీల వివరాలు:

ఎం.వి.సూర్యకళను దేవాదాయ శాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఈఓగా బదిలీ చేశారు. ఎం. విజయకుమార్‌ను తెలుగుగంగా ప్రాజెక్ట్‌ నెల్లూరు విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. జె. శివశ్రీనివాస్‌ను అసిస్టింట్‌ సెక్రటరీగా చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడకు బదిలీ జరిగింది. డి. కోదండరామిరెడ్డిని చిత్తూరు ఫారెస్ట్‌ సెంటిల్‌మెంట్‌ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఎ. శ్రీరామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ కమీషన్‌కు బదిలీ చేశారు. ఎం. శ్రీదేవి కృష్ణపట్నం హైదరాబాద్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌కు కాంపిటెంట్‌ అధారిటీగా ఒంగోలుకు బదిలీ అయ్యారు. జె. అద్దయ్యను మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. జి.వి. సుబ్బారెడ్డిని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్ధానం, ద్వారకతిరుమలకు ఈ.ఓగా బదిలీ, ఎ.బి.వి.ఎస్‌.బి. శ్రీనివాస్‌ను తూర్పుగోదావరి జిల్లా కెఆర్‌ఆర్‌పికి స్పెషల్‌ డిప్యూటీ కలెలక్టర్‌గా బదిలీ చేశారు.

ఎన్‌. శ్రీనివాసులు తిరుపతి లీగల్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఎ.మహాలక్ష్మీదేవిని చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ విజయవాడకు అసిస్టెంట్‌ సెక్రటరీగా బదిలీ చేశారు. వి.సాధన (ఎ.ఎం.ఆర్‌.డి.ఏ) అమరావతి మెట్రోపాలిటన్‌ రివిజన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. డి. రామూనాయక్‌ జిఎన్‌ఎస్‌ఎఫ్‌ యూనిట్‌ 3 ముద్దనూరు కడప జిల్లా కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బి. చిన్న ఓబులేసు నెల్లూరు జిల్లా డిస్ర్టిక్ట్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు.

ఇక కె. హేమలతను నేషనల్‌ హైవే 16 విశాఖపట్నం భూ సమీకరణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. టి. బాపిరెడ్డి నెల్లూరు జిల్లాలో ఆసరా, సంక్షేమ పథకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. కె.కృష్ణవేణి ప్రకాశం జిల్లా ఆసరా, సంక్షేమ పధకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. జి.వి. సత్యవాణి తూర్పుగోదావరి జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. కె.ఎం. బర్తారోస్మాండ్‌ నెల్లూరు జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

కె.ఎస్‌.భాగ్యరేఖ చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడలో అసిస్టెంట్‌ సెక్రటరీగా బదిలీ చేశారు. కె. దినేష్‌ కుమార్‌ను ఏపీఎన్‌ఆర్‌టి సొసైటీ సీఈఓగా డిప్యూటేషన్‌ పై నియామకం. మొత్తానికి ఒకేసారి 21 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులియ్యడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Rea more:

ముగిసిన టీటీడీ పాలకమండలి భేటీ.. రూ.2,937 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం.. ఇంకా పలు కీలక నిర్ణయాలు..